telangana government

తెలంగాణ ప్రభుత్వం వాహన లైఫ్ టాక్స్, ఫ్యాన్సీ నంబర్ల పై భారీ పెంపు.

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. వ్యక్తిగత వాహనాల లైఫ్ టాక్స్‌ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ జీవో 53, 54లను జారీ చేశారు. ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్‌గా ఉంది. ద్విచక్ర వాహనాల స్లాబ్‌లు 2 నుంచి 4కు, కార్లు, జీపుల స్లాబ్‌లు 4 నుంచి 5కు పెరిగాయి.

కార్ల ఎక్స్‌షోరూం ధర 10 లక్షల కంటే తక్కువ ఉంటే అదనపు భారం లేదు. 10-20 లక్షల మధ్య 1%, 50 లక్షలు దాటితే 2% అదనంగా చెల్లించాలి. కంపెనీలు, సంస్థలకు సంబంధించిన 10 సీట్ల లోపు వాహనాలకు స్లాబ్‌లు మార్చారు. 20-50 లక్షల వాహనాలకు 22%, 50 లక్షలు దాటితే 25% లైఫ్ టాక్స్ కట్టాలి.

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులపై అదనపు భారం మోపుతూ ఫ్యాన్సీ నంబర్ల ధరలను పెంచింది. గతంలో 5 స్లాబ్‌లు ఉండగా, ఇప్పుడు 7కు పెంచారు. 9999 నెంబర్‌కు గతంలో 50,000 రూపాయలు ఉండగా, ఇప్పుడు 1.5 లక్షలు చెల్లించాలి. 1, 9, 6666 వంటి నెంబర్లకు 1 లక్ష, 99, 999, 3333 మొదలైనవాటికి 50,000 రూపాయలు. ఇతర స్పెషల్ నెంబర్లకు 40,000 నుంచి 20,000 వరకు.

టూ వీలర్ ధర లక్షలోపు ఉంటే అదనం లేదు. లక్ష దాటితే 3%, 2 లక్షలు దాటితే 6% అదనపు లైఫ్ టాక్స్. ఉదాహరణకు, 1.1 లక్షల ధర ఉంటే గతంలో 13,200 రూపాయలు, ఇప్పుడు 16,500 రూపాయలు చెల్లించాలి. ఇది వాహనదారులకు అదనపు భారమే.