KUKATPALLY

కూకట్‌పల్లి లో సహస్ర హత్య: లాక్ బ్రేక్ చీటీతో దొరికిన హంతకుడు!

కూకట్‌పల్లి లో సహస్ర హత్య కేసు ఐదు రోజుల తర్వాత మిస్టరీ వీడింది. 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సహస్ర నివాసం ఉంటున్న భవనం పక్కనే ఉన్న బిల్డింగ్‌లో నిందితుడు నివసిస్తున్నాడు.

ఘటన రోజున సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ బాలుడు దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడ్డాడు. సహస్ర ఒంటరిగా ఉండటం గమనించి, తనను గుర్తించి చెబుతుందనే భయంతో ఆమెను హత్య చేశాడు. ఇంటిలోని దేవుడి గుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి, దాదాపు 80,000 రూపాయలను దొంగిలించాడు. సహస్ర అతడిని చూసిన వెంటనే, బాలుడు కత్తితో ఆమె గొంతుపై 7 పోట్లు, మొత్తం 18 కత్తిపోట్లతో హత్య చేశాడు.

 

పోలీసులు సీన్ ఆఫ్ క్రైమ్‌ను సందర్శించి, సీసీ ఫుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్‌లను సేకరించారు. ఒక సీసీ ఫుటేజీలో కనిపించిన షాడో, కుడిచేతి ఆధారంగా నిందితుడిని గుర్తించారు. బాలుడి ఇంటిలో రక్తం మరకలున్న బట్టలు, కత్తి, “హౌ టు బ్రేక్ ది లాక్” అనే చీటీ కనుగొన్నారు. ఈ ఆధారాలతో అతడు నేరాన్ని అంగీకరించాడు.

KUKATPALLY SAHASRA CASEKUKATPALLY CASE

సైబరాబాద్ ఎస్‌వోటీ, కూకట్‌పల్లి పోలీసులు సంయుక్తంగా ఈ కేసును విచారించి, ఐదు రోజుల తీవ్ర దర్యాప్తు తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్, సీసీ ఫుటేజీలు కీలకంగా మారాయి. పోలీసులు త్వరలో మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.