హైదరాబాద్‌లోని కూకట్పల్లి లో బాలిక హత్య కేసు.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి లో 12 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్య సంచలనం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. బాలిక తల్లిదండ్రులు వెంకటేష్, రేణుక ఉద్యోగాల కోసం బయటకు వెళ్లగా, సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంది.
మధ్యాహ్నం తిరిగి వచ్చిన తండ్రి, రక్తపు మడుగులో కూతురు శవాన్ని చూసి షాకయ్యాడు. శరీరంపై మూడు కత్తిపోట్లు గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసి, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ఫింగర్ ప్రింట్స్‌ను కీలక ఆధారాలుగా పరిగణిస్తున్నారు.
ఈ భవనంలో అపరిచితుల ప్రవేశం కష్టమని స్థానికులు చెప్పడంతో, తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు, విభేదాల కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.