CIVIL COURT HYDERABAD

హైదరాబాద్‌ను వణికించిన బాంబు బెదిరింపులు.

హైదరాబాద్‌ ను వణికించిన బాంబు బెదిరింపులు:

హైదరాబాద్‌ను వణికించిన బాంబు బెదిరింపులు, నగరం లో పలు చోట్ల బాంబులు వున్నాయి అంటూ బెదిరింపులు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో బాంబులు ఉన్నాయంటూ వచ్చిన ఇమెయిల్. సిటీ సివిల్ కోర్టు, రాజ్‌భవన్, జింఖానా క్లబ్, మరియు సికింద్రాబాద్ సివిల్ కోర్టు లో బాంబులు పెట్టాం అంటూ ఈ-మెయిల్‌ లో బెదిరింపు మెసేజ్లు అందాయి. సుమారు ఉదయం 3 గంటల 40 నిముషాల సమయం మెయిల్ రాగ అధికారు సుమారు 12 గంటలకి ఆ మెయిల్ ని చూసారు. వెంటనే అప్రమత్తం అయినా అధికారులు పోలీస్లకి సమాచారం ఇచ్చి కోర్ట్ లో ఉన్న ప్రజలని, లాయర్స్ ని కాలి చేపించారు. కోర్ట్ మూసివేసి కోర్ట్ కార్యకలాపాలని నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కోర్ట్ ప్రాంతాన్ని బాంబ్ స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్ తో పూర్తిగా పరిశీలించారు ఎటు వంటి బాంబులు లేవు అని తేల్చిన అధికారులు ఇమెయిల్ ఎవరు పంపారు ఎక్కడినుంచి పంపారు అనే విషయం పై దర్యాప్తు చేస్తున్నారు.

HYDERABAD CIVIL COURT

అయితే ఆ మెయిల్ అబీదా అబ్దుల్లా అనే పేరుతో పంపించారు. RDX , ఐదు బాంబ్స్ పెట్టినట్టుగా ఆ మెయిల్ లో చెప్పారు. వారు తమిళనాడు అన్నా యూనివర్సిటీ కి చెందిన స్టూడెంట్స్ అని కూడా ఆ మెయిల్ లో చెప్పారు. మొదట సిటీ సివిల్ కోర్ట్ లో బాంబు పేలుతుంది ఆ తర్వాత 20 నిమిషాల్లో జింఖానా  క్లబ్ లో వెళ్తుంది అని కూడా చెప్పారు.పోలీస్ లు మెయిల్ ఐపీ అడ్రెస్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే గతం లోను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బేగంపేట విమానాశ్రయం వంటి ప్రాంతాల్లో కూడా బాంబు పెట్టాం అంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.