
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి: రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం సమీపంలో గోదావరి నదిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 50.3 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 12,72,345 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తూ గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ పరిస్థితిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నీటిమట్టం మరో రెండు అడుగులు పెరిగితే, మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
గోదావరి ఉదృతి కారణంగా అధికారులు మత్స్యకారులతో సహా సామాన్య ప్రజలు నది వైపు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. లోతట్టు గ్రామాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు. వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు.