
గెలుపు బాట లో RCB
నిన్న, మే 29, 2025 మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS ) తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ పైన బౌలింగ్ తో విరుచుకపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ కి చేరుకుంది.
టాస్ గెలిచిన ఆర్ సిబి బౌలింగ్ ఎంచుకోగా మొదటి బాటింగ్ కి వచ్చిన పంజాబ్ కింగ్స్ 14 .1 ఓవర్ దగ్గర 101 పరుగులకే కుప్ప కూలింది. జోష్ హాజెల్‌వుడ్, సుయాష్ శర్మ మూడు మూడు వికెట్లు తీశారు . యష్ దయాల్ రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్,షెఫర్డ్ చెరొక వికెట్ తీసుకోగా 101 పరుగుల వద్ద ఆఖరి వికెట్ ని కోల్పోయింది. ఆ తర్వాత బాటింగ్ కి దిగి ఆర్ సిబి 10 ఓవర్లలో 106 పరుగులు చేసి వికెట్లు కోల్పోయింది. ఓపెనర్స్ గా బాటింగ్ కి వచ్చిన ఫిల్ సాల్ట్ 56 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలవగా విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అవ్వగా తరువాత వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా 19 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అవ్వగా వచ్చిన పటిదార్ నాట్ అవుట్ గా నిలిచి విజయం సాధించారు.
అయితే ఆర్ సిబి గతం లోను రెండు సార్లు ఫైనల్స్ కి చేరుకోగా ఒక సారి కూడా ట్రోఫీ ని గెలుచుకోలేదు 2011లో CSK తో 2016 లో SRH తో తలపడి ఓటమి పాలు అయింది. RCB బౌలర్లు, ముఖ్యంగా సుయాష్ శర్మ మరియు జోష్ హేజిల్‌వుడ్ (3 వికెట్లు), పంజాబ్ కింగ్స్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. RCB ఫాన్స్ మాత్రం ఈసారి తమ అభిమాన టీం కచ్చితంగా కప్ గెలుస్తుందన్న నమ్మకం తో “EE SALA CUP NAMDE ” అని అంటున్నారు.