KAMAL HASSAN OATH CEREMONY

కమల్ హస్సన్ ప్రమాణ స్వీకారం- రాజాకీయాల్లో కొత్త ఇన్నింగ్స్.

కమల్ హస్సన్ ప్రమాణ స్వీకారం- రాజాకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ :

రాజ్యసభ సభ్యుడు గా కమల్ హస్సన్ ప్రమాణ స్వీకారం చేసారు. నటుడు గా ఎంతో ప్రేక్షకాదరణ పొందిన కమల్ హస్సన్ ఇప్పుడు రాజ్యసభ లో ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేసారు.

నటుడిగా కమల్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందారు. అయన చిత్రాలు, నటన, వినూత్న ప్రయోగాలు, దర్శకత్వ ప్రతిభకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం నటుడిగా కాకుండా గొప్ప కళాకారుడిగా అభిమానిస్తారు.

ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారం తో రాజకీయంగా కొత్త పాత్ర లో కి అడుగు పెడుతున్నారు. గత వారం రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడు గా ప్రమాణ స్వీకారం చేసి తన రాజకీయ ప్రయాణం లో మరో మెట్టు ఎక్కారు.

KAMAL HASSAN

నటుడు గా ఎంతో పేరు తెచ్చుకున్న కమల్ హస్సన్ తన రాజకీయ జీవితం లో కూడ తనదైన ముద్ర వేసుకోవాలనే వారి తపన వారి ముఖం లో స్పష్టం గా కనిపిస్తుంది.

కమల్ తన రాజకీయయ పార్టీ అయిన MMM (మక్కల్ నీది మయ్యం) ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించాలి అనుకున్న కమల్ కి ఇక పై పార్లమెంట్ లో వారి సమస్యల పై చర్చించే అవకాశం వచ్చిందంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

KAMAL HASSAN

2018 లో తన పార్టీ ని స్థాపించారు అప్పటి నుంచి అయన తమిళనాడు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు గా అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్ డీఎంకే కూటమి మద్దతు లో రాజ్యసభ కు ఎన్నికయ్యారు.

ఈ కొత్త బాధ్యత తో కమల్ హస్సన్ ప్రజల సమస్యలను ఎలా తీరుస్తారో ప్రజల అంచనాలని ఎంత వరకు నెరవేరుస్తారో రాజకీయ జీవితం ఎలా సాగుతుందో చూడాలి.