హరిద్వార్ మనసాదేవి ఆలయం లో విషాదం.
హరిద్వార్ మనసాదేవి ఆలయం లో విషాదం : తొక్కిసలాటలో ఆరుగురు మృతి
హరిద్వార్ మనసాదేవి ఆలయం లో జరిగిన ఒక విషాద సంఘటన భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆలయం లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 15 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం, ఆలయం మెట్ల మార్గంలో హై టెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడడంతో భక్తులు కరెంట్ షాక్ భయంతో ఒక్కసారిగా పరుగులు తీసారు. ఈ గందరగోళంలో తొక్కిసలాట జరిగి, ఈ దుర్ఘటన సంభవించింది.
సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. చాలా మంది భక్తులు గాయాలతో బాధపడుతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
హరిద్వార్ మనసాదేవి ఆలయం లో ప్రముఖ యాత్రా స్థలం. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. అయితే, ఈ ఘటన ఆలయంలో భద్రతా ఏర్పాట్లపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. అధికారులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.