Delhi CM Rekha Gupta

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త పై దాడి: కొత్త మలుపు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త పై జరిగిన దాడి ఘటన కొత్త మలుపు తీసుకుంది. నిందితుడు గుజరాత్‌కు చెందిన రాజేష్ సకార్యాగా గుర్తించబడ్డాడు. అయితే, దాడి వెనుక కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాజ్కోట్‌లోని రాజేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడి కుటుంబాన్ని విచారించగా, అతడి తల్లి ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. రాజేష్‌కు కుక్కలంటే ఇష్టమని, సుప్రీం కోర్టు వీధి కుక్కలపై తీర్పు తర్వాత అతడు ముభావంగా ఉంటున్నాడని, ఈ నేపథ్యంలో దాడి చేసి ఉండొచ్చని ఆమె తెలిపారు. అయితే, అరెస్టైన తన బంధువును విడిపించేందుకు రాజేష్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త సాయం కోరిన వ్యవహారంలోనే దాడి జరిగి ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు.

delhi rajesh sakarya

సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ఈ ఉదయం జరిగిన ఈ ఘటనలో, రాజేష్ మొదట పత్రాలు అందించి, తర్వాత అరుస్తూ దాడి చేశాడు. భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో రేఖా గుప్త షాక్‌కు గురై, ఆమెను ఆసుపత్రికి తరలించారు. రాజకీయ పక్షాలు ఈ దాడిని ఖండించాయి. ఇది ప్రత్యర్థుల కుట్ర కావచ్చని మంత్రి మంజీందర్ సింగ్ శిశులా అనుమానించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేత అతిషి పేర్కొన్నారు. సీఎంకే రక్షణ లేనప్పుడు సాధారణ మహిళల స్థితి ఏమిటని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.