mass jathara

మాస్ జాతర టీజర్ : రవితేజ 75వ సినిమా సందడి

మాస్ జాతర టీజర్: రవితేజ 75వ సినిమా సందడి

రవితేజ మాస్ ఎనర్జీ డబుల్ :

మాస్ మహారాజ్ రవితేజ తన 25 ఏళ్ల సినీ ప్రస్థానంలో 75వ చిత్రం మాస్ జాతర టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీని రెట్టింపు చేస్తూ, గ్రాండ్‌గా ప్రవహిస్తోందని అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. రైల్వే పోలీస్‌గా రవితేజ యాక్షన్ సీన్స్ అదుర్స్ అని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. చరిత్ర, బ్యాక్‌గ్రౌండ్‌కు సంబంధించిన డైలాగులు ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకుంటున్నాయి.

శ్రీలీల లుక్స్ స్పెషల్ అట్రాక్షన్ :

ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా, ఆమె లుక్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. “ఇంటర్‌లో 100 మార్కులా, 60 మార్కులా?”, “సైన్స్ ఎందుకు ఇష్టం?”, “తిక్క రేగితే ఏం చేస్తాడు?” వంటి ఆసక్తికర డైలాగులతో టీజర్ అదిరిపోయిందని టాక్. ఈ నెల 27న మాస్ జాతర ప్రేక్షకుల ముందుకు రానుంది.

రవితేజ-శ్రీలీల హిట్ కాంబో :

రవితేజ, శ్రీలీల కాంబినేషన్ ఇప్పటికే హిట్ పేర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ సెంటిమెంట్ మాస్ జాతరతో మరోసారి నిరూపితమవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్నాళ్లుగా బంపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం ఊపు తెస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది.

శ్రీలీల పాన్-ఇండియా ప్రయాణం :

శ్రీలీల తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్-ఇండియా స్టార్‌గా ఎదుగుతోంది. ఇటీవల కన్నడ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తమిళంలో శివకార్తికేయంతో సినిమా చేస్తోంది. త్వరలో అజిత్‌తో జోడీ కట్టనుందని, ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనుందని సమాచారం.