
బెట్టింగ్ యాప్ కేసులో విజయ్ దేవరకొండ ఈడి విచారణ
బెట్టింగ్ యాప్ కేసులో విజయ్ దేవరకొండ ఈడి విచారణ :
హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కార్యాలయంలో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో హవాలా ద్వారా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయ్, మూడేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఈడి కార్యాలయానికి చేరుకున్నారు. ఈడి అధికారులు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి చట్టవిరుద్ధమైన లావాదేవీలు, కమిషన్ల గురించి ప్రశ్నించనున్నారు.
ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్‌ను ఈడి ప్రశ్నించగా, ఆయన బెట్టింగ్ యాప్‌లను మళ్లీ ప్రమోట్ చేయనని తెలిపారు. అలాగే, టాలీవుడ్ నటుడు రాణ ఆగస్టు 11న, మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఈడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 29 మంది నటీనటులకు నోటీసులు అందాయి.
ఈడి దర్యాప్తులో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వల్ల లక్షల రూపాయల అప్పులు, ఆత్మహత్యల వంటి సమస్యలు తలెత్తాయని, చైనాకు సంబంధించిన బెట్టింగ్ యాప్‌ల నుంచి మనీ లాండరింగ్ ద్వారా నగదు లావాదేవీలు జరిగాయని తేలింది. విజయ్ దేవరకొండ విచారణ సందర్భంగా పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.