daggubati family

దగ్గుబాటి కుటుంబం పై నాంపల్లి కోర్టు ఆగ్రహం.

దగ్గుబాటి కుటుంబం పై నాంపల్లి కోర్టు ఆగ్రహం. ఫిలిం నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత ఘటనలో వెంకటేష్, రాణ, సురేష్ బాబు దగ్గుబాటిపై కేసు నమోదైంది. లీజ్ వివాదంతో నందకుమార్ నడుపుతున్న ఈ రెస్టారెంట్‌ను 2022లో కూల్చివేశారని, దీనిపై నందకుమార్ నాంపల్లి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఐదు సెక్షన్ల కింద కేసు నమోదై, విచారణకు హాజరు కావాలని దగ్గుబాటి కుటుంబానికి నోటీసులు జారీ అయ్యాయి. అయితే, వీరు విచారణకు హాజరు కాకుండా కాలయాపన చేస్తున్నారని నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆగస్టు 1న కచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, వెంకటేష్, రాణ, సురేష్ బాబు హాజరు కాలేదని తెలుస్తోంది. కోర్టు ఆదేశాలను దిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నందకుమార్ ఆరోపణల ప్రకారం, లీజ్ కొనసాగుతుండగానే బౌన్సర్లతో కిచెన్‌ను అక్రమంగా కూల్చారు. దగ్గుబాటి కుటుంబం మాత్రం ఇది అక్రమ కబ్జా ప్రయత్నమని వాదిస్తోంది. కేసు విచారణలో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి.