RAILWAY NOTIFICATION

RRB లో ఉద్యోగ అవకాశాలు : 6238 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల.

రైల్వే లో ఉద్యోగ అవకాశాలు – 6238 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల :

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB లో 6238 టెక్నీషియన్ (గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 ) విభాగంలో భర్తీ కోసం నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 183 ఖాళీలు , టెక్నీషియన్ గ్రేడ్ 3 లో 6055 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు RRB అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోగలరు. ఆన్‌లైన్ దరఖాస్తు 28-06-2025 న ప్రారంభమవుతుంది మరియు 28-07-2025 న ముగుస్తుంది .

విద్య అర్హత ఆర్‌ఆర్‌బి టెక్నీషియన్ పోస్టులకు, అర్హత గ్రేడ్‌ను బట్టి మారుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు (సిగ్నల్) కు సాధారణంగా B.Sc. డిగ్రీ అవసరం. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్, లేదా సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి .

టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు (10వ తరగతి) తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ లేదా సంబంధిత రంగంలో అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి.

rrb

వయోపరిమితి – టెక్నీషియన్ గ్రేడ్ 1 కి 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్యలో ఉండాలి
వయోపరిమితి – టెక్నీషియన్ గ్రేడ్ 3 కి 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలు మధ్యలో ఉండాలి
వయో సడలింపు – SC/ST వారికీ 5 సంవత్సరాలు; ఓబీసీ వారికీ 3 సంవత్సరాలు : PWD వారికీ 10 సంవత్సరాలు.

ఇందుకుగాను అప్లికేషన్ ఫీ జనరల్ వారికి: రూ. 500/-
SC/ ST/ ESM/ PWDS/ ట్రాన్స్ జెండర్ / మైనారిటీ/ మహిళా/ ఈబీసీ వారికి: రూ. 250/- ఫి చెల్లింపులు ఆన్‌లైన్ లో చేయవచ్చు.

అప్లై చేసుకోవాలి అనుకునేవారు రైల్వే అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు rrbapply.gov.in. నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం (CEN నం. 02/2025 ) అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.