స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఉద్యోగాల దరఖాస్తుకు రెండు రోజులే!
ఎస్‌బీఐ(SBI ) PO ఉద్యోగాల దరఖాస్తుకు రెండు రోజులే :
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా( SBI) ఇటీవల 541 ప్రొబేషనరీ ఆఫీసర్( PO ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన వివరాలు చూద్దాం. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అఫిషియల్ వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.
ఆన్‌లైన్ దరఖాస్తు :
దరఖాస్తు ప్రారంభం : 24-06-2025
దరఖాస్తు ముగింపు : 14-07-2025
మొత్తం పోస్ట్లు : 541 పోస్ట్లు
విద్య అర్హత : ఏదైనా విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ ౩౦ 2025 నాటికీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : 01 – 04 – 2025 నాటికి 21 సంవత్సరాల నుండి ౩౦ సంవత్సరాల మధ్యలో ఉండాలి.
వయోపరిమితి సడలింపు :
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
PWD అభ్యర్థులకు 10 -15 సంవత్సరాలు.
ఇందుకుగాను అప్లికేషన్ ఫీ జనరల్/OBC / EWC వారికి: రూ.750 /-
SC/ ST/ PWDS వారికి ఫీజు లేదు.
అర్హత గలవారు కేవలం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అధికారిక వెబ్సైటు లో నే దరఖాస్తు చేసుకోగలరు.
ఆఫీషియల్ వెబ్సైటు – https://bank.sbi/web/careers/current-openings.