srusti test tube centre

సృష్టి ఫెర్టిలిటీ, డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్‌లో షాకింగ్ వివరాలు.

సృష్టి ఫెర్టిలిటీ కేసు:

సృష్టి ఐవీఎఫ్ సెంటర్‌లో అక్రమ సరోగసీ, పిల్లల ట్రాఫికింగ్ కేసులో డాక్టర్ నమ్రత తన నేరాలను అంగీకరించారు. పోలీసుల విచారణలో ఆమె కన్ఫెషన్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1998 నుంచి ఈ అక్రమాలు మొదలైనట్లు అధికారులు తెలిపారు. సరోగసీ పేరుతో ఒక్కో దంపతుల నుంచి 20-30 లక్షలు వసూలు చేసి, ఏజెంట్ల ద్వారా ఆదివాసీ, గిరిజన పిల్లలను కొనుగోలు చేసి అప్పగించినట్లు నమ్రత ఒప్పుకున్నారు. కొన్ని సందర్భాల్లో 30-50 లక్షల వరకు డబ్బు తీసుకున్నారు.

srusti test tube centre

మహారాణిపేట, వైజాగ్ టూ టౌన్, గోపాలపురం పోలీస్ స్టేషన్లలో 10కి పైగా కేసులు నమోదైనట్లు చెప్పారు. 2020లో మహారాణిపేట కేసులో రిమాండ్‌కు వెళ్లి వచ్చినా, మళ్లీ నేరాలు కొనసాగించారు. విజయవాడ, హైదరాబాద్, వైజాగ్‌లోని కొందరు డాక్టర్ల సహకారంతో ఈ అక్రమాలు జరిగాయని వెల్లడించారు. ప్రభుత్వ వైద్యుల పాత్రపై కూడా విచారణ జరుగుతోంది.

ఐదు రోజుల కస్టడీ విచారణ తర్వాత కోర్టుకు సమర్పించిన రిపోర్ట్‌లో ఈ వివరాలు బయటపడ్డాయి. సరోగసీ అక్రమాలు, పిల్లల ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.