srikakulam stampede

శ్రీకాకుళం ఆలయంలో తొక్కిసలాట: 10 మంది మృతి

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం శనివారం ఏకాదశి సందర్భంగా భారీ రద్దీ నెలకొన్నది. స్వామి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ సామర్థ్యానికి మించిన జనసమూహం కారణంగా ఒక్కసారిగా తోపులాట మొదలైంది. ఇన్‌లెట్, అవుట్‌లెట్ లైన్లు ఒకేచోట కలిసిపోవడంతో రైలింగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో భక్తులు కిందపడి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ 31 మందికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

శ్రీకాకుళం జిల్లాలోని ఈ ఆలయం సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. తిరుమల దర్శనం కాలేదని భక్తుడు పాండా 10 కోట్ల రూపాయలతో సొంతంగా నిర్మించి, ఏడాది క్రితం ప్రారంభించాడు. అయినా నిర్వాహకులు రద్దీని అంచనా వేయలేదు. ఇన్-అవుట్ లైన్లు ఒకేచోట ఉండటం, టైల్స్ ఫ్లోర్, బలహీనమైన రైలింగ్‌లు ప్రధాన కారణాలు. భక్తుల వస్తువులు, పూజ సామగ్రి చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి.

srikakulam incident

ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టం. ఏపీలో ఏడాదిలోనే మూడు ఆలయాల్లో తొక్కిసలాటలు జరిగాయి – తిరుమలలో 6, సింహాచలంలో 7 మరణాలు. గోదావరి పుష్కరాల్లో 27 మంది బలి. దేశవ్యాప్తంగా యూపీ హత్రాస్‌లో 120, ఇండోర్‌లో 36, వైష్ణోదేవిలో 12 మరణాలు జరిగాయి. 2008లో రాజస్థాన్‌లో 250, 2005లో మంద్రాదేవిలో 340 మంది చనిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా సరైన భద్రతా ఏర్పాట్లు లేవు. దేవుని దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం.