మొంతా తుఫాన్ ఏపీ తీరాన్ని ముంచెత్తింది
మొంతా తుఫాన్ తీవ్ర తుఫాన్ కోనసీమ బెల్ట్‌లో ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు 6-8 గంటలు పట్టవచ్చని వాతావరణ శాఖ అంచనా. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, ఉప్పాడ ప్రాంతాల్లో భీభత్స వర్షాలు, భారీ చెట్లు నేలకూలుతున్నాయి, విద్యుత్ స్తంభాలు తెగిపడుతున్నాయి. విశాఖ, అనకాపల్లి, అల్లూరి ఏజెన్సీల్లో అతిభారీ వర్షాలు, గంటకు 80 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరాన్ని తాకే సమయంలో 100-110 కిమీ వేగం ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు.
విశాఖలో హైవేలపై చెట్లు కుప్పకూలి ట్రాఫిక్ అంతరాయం. గాజువాక, మలకాపురం ప్రాంతాల్లో రోడ్లు జలమయం, పోలీస్ స్టేషన్‌లోనూ నీరు చేరింది. 15-20 సెం.మీ వర్షపాతం నమోదు. బీచ్ ప్రాంతాల్లో పోలీసుల బందోబస్త్, ఎవరినీ అనుమతించడం లేదు. మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయం భయం.

సీఎం చంద్రబాబు అమరావతి నుంచి, మంత్రులు జిల్లాల్లో పరిస్థితి పర్యవేక్షణ. అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సన్నద్ధం. చెట్లు, స్తంభాలు తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ టీమ్స్ సిద్ధం. టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో. ప్రజలు అత్యవసరం తప్ప బయటకు రావద్దని హెచ్చరిక. కేంద్రం రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతోంది. రాత్రి ప్రభావం మరింత తీవ్రమవుతుందని అంచనా. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.