tirupathi railway station

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపం లో అగ్ని ప్రమాదం.

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపం లో అగ్ని ప్రమాదం :

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపం లో అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదం లో రెండు రైళ్ల భోగీలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

అసలేం జరిగింది ?

తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు దిగిన తరువాత లూప్ లైన్ నుండి రైల్వే గ్యారేజ్ వెళ్ళడానికి ఆగి ఉన్న తిరుపతి – హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలు లో మొదట మంటలు అంటుకున్నాయి అవి తీవ్రంగా వ్యాపించి రైలు భోగి పూర్తిగా కాలిపోయింది పక్కన ట్రాక్ పై ఉన్న రాయలసీమ- షిర్డీ ఎక్స్ప్రెస్ రైలు కి కూడా మంటలు అంటుకోగా జనరేటర్ ఉన్న భోగి లో కూడా మంటలు చెలరేగాయి.

tirupati railway station

భారీ ఎత్తున మంటలు రావడం తో పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదం ప్రయాణికులు అందరు దిగిపోయి అవి శుభ్రం చేస్తున్న సమయం లో జరగడం వల్ల ఎటు వంటి ప్రాణ నష్టం జరగలేదు అని అక్కడి అధికారులు చెప్పారు.

tirupati railway station

ఈ ప్రమాదం రైల్వే స్టేషన్ సమీపం లోనే సంభవించడం అక్కడి రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం దేనివల్ల జరిగింది అనే అంశం పై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు