TIRUPATI SHIVALINGAM

తిరుపతిలో శివలింగం కళ్ళు తెరిచిందంటూ భక్తుల సందడి.

తిరుపతిలో శివలింగం కళ్ళు తెరిచిందంటూ భక్తుల సందడి :

తిరుపతిలో శివలింగం కళ్ళు తెరిచిందంటూ ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఎంత వరకు వాస్తవమా అనే అంశం మీద విభిన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఆలయ సమాచారం :

తిరుపతిలో ని గాంధీపురం ప్రాంతం లో ఉన్న ఒక పాత కలం నాటి మునిరాత్మ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం లో శివ లింగం నేత్రాలు తెరిచిందంటూ వార్తలు వచ్చాయి.

ఆలయం లో ని పూజారి ఉదయం అభిషేకం చేసి అలంకరించిన తరువాత శివ లింగం పై కళ్ళు ఏర్పడ్డాయి అని చెప్పారు. ఈ వార్త తెలియగానే భక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చారు.

అర్దరాత్రి వరకు జన సమూహం స్వామి వారిని దర్శించుకోడానికి వస్తూనే ఉన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడం తో ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఈ సంఘటన ఆసక్తికరంగా ఉండటం తో దర్శనానికి వచ్చిన భక్తులు వారి ఫోన్లలో వీడియో లు ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్లు చేయగా అవి వైరల్ అయ్యాయి.

ఏ సంఘటన మీద రెండు రకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయి, ఇలా జరగడం ఒక అద్భుతం ల అనిపించినప్పటికీ ఎంత వరకు వాస్తవమా అనేది భక్తులు తేల్చుకోలేకపోతున్నారు. చాలా మంది భక్తులు ఇది శివుని లీల గా శ్రావణ మాసం ప్రారంభం అయిన వేళా విశేషం గా శుభ శూచికం అంటున్నారు.

కొందరు భక్తులు ఇది విభూతి తో చేసిన అలంకరణ గా చెప్తున్నారు. గతం లో కూడా ఇలాంటి సంఘటన లు జరిగాయి కానీ అవి వాస్తవం కాదు అని కూడా నిర్ధారణ అయ్యింది కాబట్టి కొందరు భక్తులు అవి అవాస్తవం అని ఈ వార్త ని కొట్టిపారేస్తున్నారు.

ఈ వార్తపై స్పష్టమైన నిర్ధారణ లేదు. ఇది పూర్తిగా భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.