telangana arogya sri

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలపై నెట్వర్క్ హాస్పిటల్స్ అల్టిమేటం

బకాయల కారణంగా సేవల నిలిపివేత హెచ్చరిక :

తెలంగాణలో నెట్వర్క్ హాస్పిటల్స్ మరోసారి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసే అల్టిమేటం ప్రభుత్వానికి జారీ చేశాయి. 1400 కోట్ల రూపాయల బకాయలు ఆసుపత్రులపై ఆర్థిక భారంగా మారడంతో, అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని ప్రకటించాయి. 20 రోజులుగా ఆరోగ్య శాఖ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యాలు వెల్లడించాయి. గత సంవత్సరం నుంచి బిల్లులు చెల్లించకపోవడం, సిబ్బంది జీతాలు, మందుల కొనుగోలు, నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపాయి.

ప్యాకేజీ రేట్ల పెంపు డిమాండ్ :

వైద్య సేవల ధరలు పాతవైనవి కావడంతో, ప్యాకేజీ రేట్లను పెంచాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. రేట్లు పెంచకపోవడం వల్ల ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి సానుభూతి లేకపోవడం, బకాయల అంశంలో స్పందన లేకపోవడం ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవల సమస్యలు :

ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులు కూడా నేటి నుంచి ఓపీ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. ఆసుపత్రుల సంఘం సీఓ కి లేఖ రాసి, ఉచిత వైద్య సేవలకు సహకరిస్తున్నా, 2000 కోట్ల బకాయలతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించాయి. వారం రోజుల్లోగా బకాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. లేనిపక్శ ఆందోళనలు గురించి ఆలోచిస్తామని హెచ్చరించాయి.

DR.NTR Vaidhya Seva

పరిస్థితి తీవ్రత :

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రుల ఈ నిర్ణయం పేదవాదులకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆరోగ్య సేవల్లో విస్తృత క్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.