తమిళనాడు లో ఘోర ప్రమాదం – మృతి చెందిన విద్యార్థులు.
తమిళనాడు లో ఘోర ప్రమాదం – మృతి చెందిన విద్యార్థులు :
తమిళనాడు లో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం కడలూరు జిల్లాలోని స్కూల్ వ్యాన్ రైల్వే గేట్ దాటుతుండగా రైలు స్కూల్ వాన్ ను ఢీ కొట్టింది. విల్లుపురం నుంచి మైలాడుదురై పాసెంజర్ చెమ్మంగుప్పం లెవెల్ క్రాసింగ్ చేస్తుండగా ఈ ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో ఇద్దరు పిల్లలు మరణించారు. ప్రమాద సమయం లో 4 విద్యార్థులు మరియు డ్రైవర్ ఉన్నారు. ఒక విద్యార్థి ఘటనాస్తలం లోనే మరణించగా, మరొకరు ఆసుపత్రి లో వైద్యం తీసుకుంటూ మరణించారు. డ్రైవర్ మరియు ఇద్దరు విద్యార్థులు కడలూరు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.

రైల్వే గేట్ వద్ద గేట్ కీపర్ రైలు వచ్చే సమయం లో గేట్ వేయకపోవడం వల్ల మరియు వాన్ డ్రైవర్ దానిని గమనించకుండా రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో పూర్తిగా గేట్ కీపర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్న రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు గేట్‌కీపర్‌ను సస్పెండ్ చేసి, అతనిపై చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. మరణించిన వాళ్ళకి మరియు గాయపడ్డవారికి రైల్వే అధికారులు, తమిళనాడు ప్రభుత్వం ఎక్స్-గ్రేషియా ప్రకటించింది.