
అసలు మేడే అంటే ఏంటి ?
మే 1న మేడే కార్మికుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటాం, అసలు మేడే అంటే ఏంటి ?
మేడే అంటే ఒక్క భారత్ లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా చేసుకుంటారు.
ప్రతి ఏడాది మే 1 న కార్మికుల సెలవు రోజు గా చేసుకుంటాం. అయితే ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడి పెట్టలేం.
ప్రతి దేశంలోనూ కార్మికుల పైన జరిగిన పని ఒత్తిడిలను శ్రమ కు తగ్గ ఫలితం దక్కడం లేదు అని ఎందరో కార్మికులు చేసిన పోరాటమే ఈ మేడే.
అయితే మొట్టమొదటి పోరాటం మాత్రం 1886 లో షికాగోలోని కార్మికులు చేసిన పోరాటమే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు.
ఆ రోజున వారు 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు రిక్రియేషన్ ఎనిమిది గంటలు విశ్రాంతి అంటూ చేసిన పోరాటం పునాది గా చూపచ్చు.
ఆ తరువాత జరిగిన ఎన్నో పోరాటాల తో 1889 న సోషలిస్ట్ అండ్ లేబర్ పార్టీస్, మే 1 న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా ప్రకటించింది, భారతదేశంలో మాత్రం 1923 లో మొదటిసారి మేడే ప్రకటించడం జరిగింది.