
మరో విషాదం కేదార్నాథ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.
మరో విషాదం కుప్పకూలిన హెలికాఫ్టర్ :
ఉత్తరాకాండ్ లోని గౌరీకుండ్ అడవి ప్రాంతం లో కేదార్నాథ్ వెళ్తుండగా కుప్పకూలిన హెలికాఫ్టర్ . అహ్మదాబాద్ ఘటన ఇంకా మరవనే లేదు ఇంతలోనే ఇంకొక ఘోర ప్రమాదం. కేదార్నాథ్ నుండి గుప్తకాశీ వెళ్తుండగా గౌరీకుండ్ అటవీ ప్రాంతం లో హెలికాఫ్టర్ కుప్ప కూలింది. కేదార్నాథ్ ఆలయం తెరుచుకున్న తరువాత ఈ ఆరు వారాల్లో ఇది 5 వ హెలికాఫ్టర్ ప్రమాదం. మొదట మే 8 న ఉత్తరకాశి దగ్గర ప్రమాదం సంభవించగా అందులో పైలట్ తో సహా ఆరుగురు మరణించారు, ఒక వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డారు. తరువాత జరిగిన మూడు ప్రమాదాల్లో భక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ నేపధ్యం లో కేదార్నాథ్ లో ని హెలికాఫ్టర్ సేవలను రెండు రోజులు పాటు నిలిపివేశారు.
ఆర్యన్ కంపెనీ కు చెందిన ఈ హెలికాఫ్టర్ తెల్లవారుజామున 5 .20 నిమిషాలకి కేదార్నాథ్ నుండి గుప్తకాశీ కి బయలుదేరింది.
వారు ఉన్న ప్రదేశం లో వాతావరణం అనుకూలించక లేక సాంకేతిక లోపాల కారణం వల్ల గాని హెలికాఫ్టర్ నియంత్రణ కోల్పోయి అక్కడే కుప్ప కూలిపోయి ఉండచ్చు అని అంచనా. ఈ ప్రమాదానికి కారణాలు ఏమైఉంటాయ అని కేదార్నాథ్ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసారు ఈ ప్రమాద సమయం లో హెలికాఫ్టర్ లో ఏడుగురు ఉన్నారు. పైలట్ తో పాటు ఆరుగురు భక్తులు ఉండగా అందులో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. హెలికాఫ్టర్ కుప్ప కూలడం తో అందులో ఉన్న అందరూ మరణించారు.
ప్రమాదం జరిగిన వెంటనే SDRF , NDRF బృందం మరియు స్థానిక పోలీసులు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులు న్యూ ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్,ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించారు.