Headlines
INDIA PLACES

భారత్ పై పాకిస్తాన్ దాడులు 

ఆపరేషన్ సిందూర్ కి కౌంటర్ ఎటాక్ గా పాకిస్తాన్ పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. మొత్తం 15 ప్రాంతాలల్లో దాడి చేసిన పాకిస్తాన్.

భారత సాయుధ దళాలు పాక్‌లోని నాలుగు ఉగ్రవాద శిబిరాలపై మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఐదు ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించిన ఒక రోజు తర్వాత భారతదేశంపై పాకిస్తాన్  చర్యకు ప్రయత్నించడం జరిగింది.

నిన్న సాయంత్రం పాకిస్తాన్ ఆర్మీలు LOC వద్ద కాల్పులు కి తెగబడాయి. భారత పౌరులే లక్ష్యం గా కాల్పులు కొనసాగిస్తున్నాయి పాకిస్తాన్ దళాలు.

పూంచ్ సెక్టార్ లో సామాన్యులను టార్గెట్ చేసుకున్న పాక్ , ఆర్టిలరీ గన్స్ , ట్యాంకర్లు తో దాడులు 15 మంది భారత పౌరులు మృతిచెందరూ, 50 మందికి పైగా గాయాలపాలు అయ్యారు.

పాకిస్తాన్ రిప్లై

నిన్న దాడి లో చనిపోయిన ఉగ్రవాదులుకి స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రధాని అంతిక్రియలు లో పాల్గొనడం చూడచ్చు. మరణించిన తీవ్రవాదులకి ప్రభుత్వ లాంఛనతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. పాక్ ప్రధాని, రక్షణ శాఖ మంత్రి భారత్ పై ప్రతీకార చర్య తీర్చుకుంటాం అని చెప్పారు .

భారత్ స్పష్టత

తాము కేవలం ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించాం అని సామాన్య పౌరులకి ఎటువంటి హాని చేయలేదు అని ప్రకటించారు.

పాక్ ఎరియల్ స్ట్రైక్

బుధవారం రాత్రి మరియు గురువారం తెల్లవారుజామున 15 భారతీయ నగరాలపై క్షిపణులను ప్రయోగించింది పాకిస్తాన్.

అవంతీపుర ,శ్రీనగర్ ,జమ్మూ,పఠాన్ కోట్ ,అమృత్ సర్,కపూర్ తల ,జలంధర్ ,లూథియానా ,ఆదమ్ పూర్ ,బటిండా చండి గఢ్,నాల్, ఫలోడీ ,ఉత్తర్ లయ్ మరియు భుజ్ ప్రాంతాలో క్షిపణులను మోహరించారు. అయితే గగన స్థలం లో S400 ఉపయోగించి భారత సేన వాటిని తిప్పికొట్టింది.

పాకిస్థాన్ పై తిరుగు దాడులు చేసిన భారత్

పాకిస్థాన్ లో ని లాహోర్ సిటీ తో పాటు 9 నగరాల పైన భారత్ డ్రోన్ ల తో దాడి చేసింది. పాకిస్థాన్ ఆర్మీ బేస్ ల పై విరుచుపడిన భారత్. చైనా తయారు  చేసిన HQ9 డిఫెన్స్ సిస్టం ని సర్వనాశనం చేసిన భారత్ .

రావల్పిండి క్రికెట్ స్టేడియం వద్ద భారత్ డ్రోన్ ల తో దాడి చేసింది. ఈ రోజు రావల్పిండి స్టేడియం లో జరిగే పాకిస్థాన్ సూపర్  లీగ్ మ్యాచ్ ను రద్దు చేశారు.