
అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానం.
అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానం :
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం సరిగా టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. విమానం లో 241 ప్రయాణికులు ఉన్నారు, విమానం కూలిపోయి భారీగా మంటలు రావడం తో అక్కడికక్కడే చనిపోయారు. 242 ఒకే ఒక్క వ్యక్తి బ్రతికాడు సీట్ నెంబర్ 11 ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బైటికి దూకేశారు ఆలా అయన ఒక్కరే మృత్యుంజయుడు అయ్యాడు. చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు బీజేపీ నేత అయిన రూపాని 2016 – 2021 వరకు గుజరాత్ సీఎం గా పని చేసారు. 242 ప్రయాణికులలో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, ఇద్దరు శిశువులు, 53 మంది బ్రిటిష్, ఏడుగురు పోర్చుగీస్, 2 కెనడా పౌరులు ఉన్నారు. విమానం కూలిపోయిన సమయం లో ఫ్యూయల్ నిండుగా ఉండటం వల్ల పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ తీవ్రమైన మంటలు వ్యాపించడం వల్ల ప్రయాణికులు చనిపోయినట్టు గా తెలుస్తుంది. మరణించిన వారిని గుర్తుపట్టే ఆస్కారం లేదని కేవలం DNA పరీక్ష చేసి మాత్రమే గుర్తించి వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పచెపుతాము అన్నారు.
విమానం సరిగ్గా ఈ రోజు మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్- లండన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ 5 నిమిషాల్లోనే పడిపోయింది. కుప్ప కూలిన విమానం BJ మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడడం తో భోజనం చేస్తుండగానే బూడిదయ్యారు. ఐదుగురు మరణించారు , 40 మంది జూనియర్ డాక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. హాస్టల్ డైనింగ్ హాల్ లో భోజనం చేస్తుండగా జూనియర్ డాక్టర్ల మీద పడిన విమానం. ఈ ఘటన జరిగిన సమయం లో హాస్టల్ లో 200 మంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. అంతేకాక అక్కడ ఉన్న ఇల్లులు, హాస్టళ్లు, అపార్టుమెంట్లు చాల ప్రదేశాలు ఈ పేలుడు కి దెబ్బ తిన్నాయి. ఇప్పటికి ఎంత మంది చనిపోయారు అనే విషయం తేల్చలేకపోతున్నారు, శవాలు అన్ని ముక్కలు ముక్కలు గా అయిపోయి ఉండటం తో వివరాలు అందించలేకపోతున్నారు.
ఈ ఘటన పై టాటా గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి అవసరమైన వైద్య ఖర్చులని వారే భరిస్తారని చెప్పారు. అలాగే విమానం కూలడం తో ధ్వంసం అయిన BJ మెడికల్ కాలేజీ హాస్టల్ నిర్మాణానికి కూడా సహకారం అందిస్తాం అని చెప్పారు.
ఈ ఘటన పై తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ప్రధాన మంత్రి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, సినీ హీరో లు అందరు తీవ్ర విచారం వ్యక్తం చేశారు వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఎందుకు అయ్యింది అనే ప్రశ్న కి ఇంకా సమాధానం దొరకలేదని చెప్పచ్చు.