hyderabad dsr groups

హైదరాబాద్‌లో డిఎస్ఆర్ గ్రూప్ కార్యాలయాలపై ఐటీ దాడులు.

హైదరాబాద్‌లో డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీల కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాలపై ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డికి ఈ కంపెనీలో భాగస్వామ్యం ఉంది. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంతో పాటు చెన్నై, బెంగళూరులో మొత్తం 30 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి.

DSR RANJITH REDDY
గత ఐదేళ్లలో పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయనే అనుమానంతో ఐటీ అధికారులు 150 వాహనాల్లో 400 మంది సిబ్బందితో ఉదయం 7 గంటల నుంచి ఈ తనిఖీలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున పన్ను ఎగవేత జరిగినట్లు ఆధారాలు లభించాయని, ఈ సోదాలు ఆర్థిక నేరాలపై దృష్టి సారించాయని తెలుస్తోంది. సోదాల అనంతరం ఐటీ శాఖ నుంచి ప్రెస్ నోట్ విడుదలయ్యే అవకాశం ఉంది. టాక్స్ ఎగవేతకు సంబంధించిన ఆధారాల ఆధారంగా నోటీసులు జారీ చేసి, వసూళ్లు చేసే కార్యక్రమం కూడా ఉంటుందని సమాచారం.