
హైదరాబాద్‌లోని డిఎస్ఆర్ గ్రూప్ సంస్థలపై రెండో రోజు ఐటీ సోదాలు
హైదరాబాద్‌లోని డిఎస్ఆర్ గ్రూప్ సంస్థలపై రెండో రోజు కూడా ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాలు కొనసాగుతున్నాయి. చేవెళ్ళ మాజీ ఎంపి రంజిత్ రెడ్డి నివాసంతో పాటు, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండి ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి, ఇతర డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో నాలుగు ఐటీ బృందాలు గత 26 గంటలుగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లోని డిఎస్ఆర్ గ్రూప్ సంస్థలపై సోదాల్లో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉన్న శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. డిఎస్ఆర్ సంస్థతో ఈ కంపెనీకి లావాదేవీలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. డిఎస్ఆర్లో వెంకట కృష్ణ రెడ్డి పార్టనర్‌గా ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ విల్లాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది.
అయితే, ఒక చదరపు అడుగుకు 12,000-13,000 రూపాయలు వసూలు చేసినప్పటికీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కేవలం 7,000 రూపాయలు చూపించి, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో, డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా 27 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బును శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ ద్వారా దారి మళ్లించినట్లు అధికారులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సమాచారం సేకరించి, విచారణ కొనసాగిస్తున్నారు.