
ఖజానా జ్యువెలరీ దోపిడీ: బీహార్ గ్యాంగ్ షాకింగ్ క్రిమినల్ రికార్డ్
20 రోజుల క్రితం అరెస్టయిన ఆశిష్ ఇంటికి వచ్చి, 10-12 రోజులు రెక్కీ చేశారు. దీపక్, ఆశిష్ సెకండ్ హ్యాండ్ బైక్‌లు (గ్లామర్, పల్సర్) సమకూర్చారు. ఆరుగురు షాప్‌పై దాడి చేసి, 15-20 నిమిషాలు లోపల ఉండి దోపిడీకి పాల్పడ్డారు. బీహార్ నుంచి తెచ్చిన నాలుగు ఆయుధాలు వాడారు. హ్యూమన్, టెక్నికల్ ఇంటెలిజెన్స్‌తో పూణే సమీపంలో అరెస్ట్ చేశాము.
సీపీ పర్యవేక్షణలో జరిగిన దర్యాప్తులో మిగతా ఐదుగురిని గుర్తించాము. ముఖ్య నిందితుడిపై హత్యాయత్నం, రాబరీ కేసులు ఉన్నాయి. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయి. జ్యువెలరీ షాప్‌లు సరైన సెక్యూరిటీ, ఇంట్రూషన్ అలారం, పోలీస్ కనెక్టెడ్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. 24 గంటల్లో గుర్తింపు, 48 గంటల్లో అరెస్ట్‌లు సాధించిన టీమ్‌ను సీపీ ప్రశంసించారు. షాప్‌లో లాకర్ ఉందని రెక్కీలో తెలుసుకుని, గన్ చూపి తెలుసుకున్నారు.