Headlines
VEMULAWADA TEMPLE

వేములవాడ రాజన్న ఆలయం రెండు సంవత్సరాలు మూసివేత .

వేములవాడ రాజన్న ఆలయం జూన్ 15 నుంచి మూసి వేస్తారు అన్న వార్త కలకలం రేపుతోంది . రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం 47 కోట్లు తో ఆభివృద్ధి చేయాలి అని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాజన్న ఆలయాన్ని జూన్ 15 నుంచి వచ్చే రెండు సంవత్సరాలు పాటు మూసి వేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

వేములవాడ దేవాలయం లో కొలువయి ఉన్న శివుడు ని శ్రీరాజరాజేశ్వర స్వామి పేరుతో భక్తులు ఆరాధిస్తారు. వేములవాడ లో శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశి గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి దేశ నలుమూల నుంచి కల ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని పశ్చిమ చౌళుక్యుల కాలం లో నిర్మించిన పురాతన ఆలయం.

VEMULAWADA TEMPLE

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి చేపట్టాలి అని నిర్ణయించి దేవస్థాన పనులకోసం ఈ రోజు స్వచ్చందంగా బంద్ పాటించింది .

తెలంగాణ రాష్ట ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయం లో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ౩౩౦ కోట్లు ఖర్చు . ఆలయ పునర్నిర్మాన పనులు జూన్ 15 నుంచి మొదలు పెట్టనుంది .

ఈ మేరకు శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయనుంది అని వెల్లడించారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ 76 కోట్లు, నూతనంగా నిర్మించేవి నిత్యన్నదాన సత్రం నిర్మాణం కోసం మరో ౩5 కోట్లు , రోడ్స్ నిర్మాణం కోసం మరో 47 కోట్లు విడుదల చేసింది. ఈ పనులు అన్ని పూర్తీ కావడానికి కనీసం ఏదాదిన్నర నుంచి రెండు సంవత్సరాలు పట్టిది అని అంచనా. అందుకని రాజన్న ఆలయం జును 15 నుంచి మూసేసి, భక్తులకి భీమేశ్వర ఆలయం లో స్వామివారి దర్శన ఏర్పాట్లు చేస్తారంటూ ప్రకటించారు .

BHEEMESHWARA TEMPLE

జూన్ 15 నుంచి వేములవాడ రాజన్న ఆలయం మూసివేయాలి అన్న నిర్ణయం సరైనది కాదు అని రాజన్న ఆలయ పరిరక్షణ కమిటీ మరియు అఖిలపక్ష నాయకులూ వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యం లో రాజన్న ఆలయ పరిరక్షణ కమిటీ ఆలయ పునర్ నిర్మాణం ప్రణాళిక సరిగా లేదు అని స్వామివారికీ ధూప,దీప,నైవెధ్యాలు సమర్పించాలి అని వేములవాడ పట్టణ బంద్ కి పిలుపునిచ్చారు.

ఈమేరకు పట్టణ వ్యాపారులు స్వచ్చందంగా షాపులు అన్ని మూసేసి బంద్ ని పాటించారు. గతం లోను ఎన్నో దేవాలయాలు పునర్నిమాణ పనులు జరిగాయి అని అక్కడ ఎక్కడ ఆలయాన్ని మూసివేయలేదు అని మరి దక్షిణ కాశి గా ప్రసిద్ధి చెందిన రాజన్న దేవాలయాన్నీ అలా ఎలా మూసేస్తారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ ఈఓ మీడియా వారితో మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని విస్తరించాలి అని ప్రభుత్వం నిశ్చయించింది అన్నారు. నిత్యం భక్తుల రద్దీ ఎక్కువ గా ఉండడం. శివ రాత్రి, శివ కళ్యాణం , కార్తీక మాసం, శ్రావణ మాసం, లో భక్తుల రద్దీ ఇంకా అధికం అవడం తో దర్శనం కోసం ఆలయాన్ని 24 గంటలు తెరిసి ఉంచి దర్శనం, కోడె మొక్కులు తీర్చుకునే అవకాశం కలిగిస్తున్నాం అన్నారు. ఇటువంటి పరిస్థితుల దృశ్య ఆలయ కమిటీ వారితో చర్చించి ఆలయ విస్తారన చేస్తే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని వసతులు కలిగించవచ్చు అని ప్రభుత్వం తో కలిసి శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి చేస్తున్నారు. ఆలయానికి వచ్చే రోడ్లు చిన్నగా ఉండటం వల్ల రోడ్ విస్తీర్ణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ ఒక్క నిర్మాణాలు దేవస్థానం ఫండ్స్ నుంచి కానీ , భక్తులు మొక్కుల కోసం హుండీ లో వేసిన కానుకల నుంచి కానీ , అభివృద్ధి పనులు వాడడం జరగదు అని ఆలయ విస్తీర్ణ అభివృద్ధి పనులు మొత్తం పూర్తిగా ప్రభుత్వం వారు మంజూరుచేసిన నిధులతోనే జరుగుతుంది అని స్పష్టం చేసారు.

అయితే భక్తులకి ఇక్కడ ఎలా మొక్కులు చెల్లించే వసతులు ఉన్నాయో భీమేశ్వర ఆలయం లో కూడా అన్ని అలా నే కలిపిస్తాం అన్నారు. ఎక్కడ మూర్తులకు యధా విధిగా పూజలు నిర్వహిస్తాం అని అయితే భీమేశ్వర ఆలయం లో ఎప్పటినుంచి భక్తులకి దర్శన వసతులు కు కలిపిస్తామో శృంగేరి పీఠాధిపతులని సంప్రదించి వారి సూచనల మేరకు అన్ని సిద్ధం అయ్యాక డేట్ చెపుతాం అన్నారు. అప్పటి వరకు సోషల్ మీడియా లో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మద్దు అని చెప్పారు .