
బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో బాంబు
బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో బాంబు :
జూన్ 18 2025 హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో బాంబు ఉంది అంటూ వచ్చిన సమాచారం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు ఉంది అంటూ ఈ-మెయిల్ రావడం తో అప్రమత్తం అయిన ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే పోలీసులుకు సమాచారం ఇచ్చారు. సమాచారం వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ కి చేరుకున్న పోలీస్ మరియు అగ్నిమాపక సిబ్బంది.
ఎయిర్పోర్ట్ మొత్తం పోలీస్ లు బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ పూర్తిగా శోధించిన అనంతరం ఎటువంటి బాంబు మరియు అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు అని చెప్పారు. వచ్చిన ఈ-మెయిల్ లో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవం అని అధికారులు స్పష్టం చేసారు. ఈ-మెయిల్ చేసింది ఎవరు ఎక్కడినుంచి వచ్చింది అన్న విషయం పై సైబర్ క్రైమ్ పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు. గతః నెలలో కూడా ఇలానే హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కూడా ఇలానే బాంబు ఉంది బెదిరింపుల మెసేజ్లు వచ్చాయి.