
ఫోన్ టాపింగ్ కేసు లో సిట్ విచారణ కి వచ్చిన ప్రభాకర్.
ఫోన్ టాపింగ్ కేసు లో సిట్ విచారణ కి వచ్చిన ప్రభాకర్ :
ఫోన్ టాపింగ్ కేసు లో A1 గా ఉన్న ప్రభాకర్ రావు నిన్న రాత్రి భారత్ కి వచ్చారు. గత BRS ప్రభుత్వం లో ఆయన SIB చీఫ్ గా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఈ కేసు వెలుగు లో కి వచ్చింది. ఈ ఫోన్ టాపింగ్ కేసు బైటికి రాగానే ఆయన అమెరికా పరారు అయ్యారు.
ఆ తర్వాత భారత్ కి తిరిగి రమ్మన్నా రాలేదు అయితే తాజాగా సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఆయన నిన్న రాత్రి భారత్ కి తిరిగివచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఆయన నిన్న రాత్రి చేరుకున్నారు లుకౌట్ నోటీసు ఉండటం తో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనని ఆపేసారు. దాదాకు ౩గంటలు ఆయన ఎయిర్పోర్ట్ లోనే ఉన్న తర్వాత ఆయనకి క్లియరెన్స్ ఇచ్చారు.
ఈ రోజు ఆయన సిట్ అధికారులు ముందు హాజరు అవ్వనున్నారు. సిట్ విచారణలో ఫోన్స్ ఎవరు టాప్ చేయమని చెప్పారు. ఎవరి ఎవరి ఫోన్స్ టాప్ చేసారు అని సిట్ అధికారులు ఆరాధియనున్నారు.