
రైతుల ఆశ: కేసీఆర్ నాయకత్వం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదు. బీజేపీ గత 11 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసింది? ఐటీఐఆర్, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసి, రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలను, రైతులకు సాగునీటిని దూరం చేసింది. కేసీఆర్ నాయకత్వంలో తెచ్చిన పరిశ్రమలను సైతం గుజరాత్‌కు తరలించింది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వకుండా, రైతులకు అన్యాయం చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పాలనలో హామీల జాతర మాత్రమే నడిపింది. రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్లు, ఉద్యోగాలు వంటి హామీలు గాలిలో కలిసిపోయాయి. యూరియా కోసం రైతులు కిలోమీటర్ల కొద్దీ లైన్లలో నిలబడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బంధువులకు కాంట్రాక్టులు ఇస్తూ, బీజేపీ ఎంపీలకు రాష్ట్రంలో పనులు కట్టబెడుతున్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నాయి.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించారు. 73 వేల కోట్ల రూపాయలతో రైతు బంధు, దళిత బంధం, విద్యాసంస్థల స్థాపన వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ, ప్రజలను గుమ్మరిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఈ మోసాలకు సమాధానం చెప్పాలి.