
తెలంగాణ లో పెరిగిన బస్ పాస్ చార్జెస్.
తెలంగాణ లో పెరిగిన బస్ పాస్ చార్జెస్ జూన్ 9 నుంచి అమలులోకి వచ్చింది 20 శాతం కి పైగా పెరిగిన బస్ పాస్ రేట్లు. ఆర్డినరీ బస్ పాస్ ధర ఇదివరకు రూ.1,150 ఉండగా అది రూ. 1,400 కి పెరిగింది. మెట్రో ఎక్స్ప్రెస్ ధర రూ. 1,300 ఉండగా అది రూ.1,600 మెట్రో డీలక్స్ పాస్ దార రూ.1,450 ఉండగా అది ఇప్పుడు రూ.1,800 కి పెరిగాయి. అంతే కాకుండా హైదరాబాద్ పరిధిలోని గ్రీన్ మెట్రో AC బస్ పాస్ ధరలను కూడ పెంచింది.
దీని పైన తెలంగాణ రోడ్ రవాణా సమస్త అయినా TGS – RTC ఏమంటుంది అంటే డీజిల్ రేట్లు పెరగడం, బస్సుల నిర్వహణ మరియు కార్మికుల వేతనాలు వంటి సమస్యల నుంచి అధిగమించడానికి తప్పని సరి పరిస్థితుల వల్ల బస్ పాస్ ధరల్ని పెంచాం అని చెప్పారు.
ఏది ఏమి అయినప్పటికి ఈ భారం మాత్రం సామాన్యుడు మీద పడనుంది పెరిగిన బస్ పాస్ ధరల వల్ల ఉద్యోగులు మరియు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడనున్నారు.