
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం:
దాదాపు 60 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత 2014 జూన్ 2 న దేశం లో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. ఈ రోజుకి సరిగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్బంగా ప్రతి సంవత్సరం జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు.ఈ సందర్బంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ని ప్రజలు, ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలాగా జరుపుకుంటారు.
ఉద్యమం ప్రారంభం:
తెలంగాణ ఉద్యమం మొదట తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను, హక్కులను కాపాడుకునే పోరాటంగా ప్రారంభమైంది. అయితే మొదట తెలంగాణ హక్కుల కోసమే పోరాటంగా ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం జనవరి 9, 1969న ఖమ్మం పట్టణంలో రవీంద్ర నాథ్ అనే విద్యార్థి నాయకుడు గాంధీ చౌక్‌లో చేపట్టిన నిరాహార దీక్షతో ప్రారంభమైంది.
ఆ తరువాత ఎన్నో పరిణామాల మద్య ఈ పోరాటం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పోరాటం గా మారింది. 1969 తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనలో 369 మంది విద్యార్థులు మరిణించారు. ఆ తరువాత ఈ పోరాటం లో ఎన్నో పరిణామాల రాజకీయ పార్టీలు జోక్యం వలన ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు మరియు సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాల కలయిక నిర్ణయాల ద్వారా 1969 నాటి ఉద్యమం ఆగిపోయింది.
తెలంగాణా ఉద్యమం ప్రస్థానం 2001 :
కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2001 లో తెలుగుదేశం పార్టీ నుంచి పదవికి రాజీనామా చేసి ఏప్రిల్ 27 2001 న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపన చేసారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఈ పార్టీ ఏర్పడింది. అయితే గతంలో తెలంగాణ సాధన కోసం జరిగిన ఎన్నో పోరాటాలని దృష్టిలో ఉంచుకొని లోతుగా అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, తెలంగాణ ఉద్యమ వ్యూహానికి రూపకల్పన చేశారు. 2009 నవంబర్ లో కేసీఆర్ దీక్ష దివాసి పేరు తో నిరాహార దీక్ష ప్రారంభించారు ఆ తర్వాత స్వరాష్ట్రం కోసం 2009 డిసెంబరు 3వ తేదీన శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేసి తొలి అమరుడు అయ్యాడు. ఆ తరవాత విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అన్ని కలిసి ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఓ కమిటి ఏర్పడింది ఉద్యమాన్ని ఎన్నో దశలుగా ముందుకి తీసుకొని వెళ్లారు.
2011 సెప్టెంబరు 13 న ప్రారంభం ఆయన సకలజనుల సమ్మె 42 రోజుల పాటు జరిగింది ఆ సమ్మె లో తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మీకులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు, న్యాయవాదులు ఈ సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు.ఆ సమయం లో తెలంగాణ ప్రాంతంలోని అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆ సమయంలో నే ఆంధ్ర రాజకీయ నాయకులూ తమ స్వలాభం కోసం సమైక్య ఆంధ్రా పేరుతో ఉద్యమం మొదలు పెట్టారు.
2014 ఫిబ్రవరి 13 న లోక్ సభలో ప్రవేశ పెట్టారు అది 18 ఫిబ్రవరి న ఆమోదం చేసారు తర్వాత ఫిబ్రవరి 20 న రాజసభ లో ఆమోదించారు. మార్చ్ 1 న రాష్ట్రపతి చే ఆమోదం పొందింది .అప్పటి నూతన రాష్టాన్ని ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్ర శేఖర రావు గారు 2014 జూన్ 2 న అధికారికంగా తెలంగాణ రాష్టం ఏర్పాటు చేసారు.