vetlapalem Archives - TelAndra.com

వేట్లపాలెం పేలుడు: 20 మృతి, మంత్రి నారాయణ హామీ
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం లో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందారు. ఇది చాలా దురదృష్టకరమని ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.

మంత్రి నారాయణ మాట్లాడుతూ, రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి మెరుగుపడుతోందని స్పష్టం చేశారు. హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్‌లో తొమ్మిది మంది సీరియస్‌గా ఉన్నారని, వారికి స్పెషల్ పరిశీలనతో చికిత్స అందిస్తున్నామని వివరించారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఉన్నవారికి 20% కంటే తక్కువ బర్న్స్ ఉన్నాయని, వారి పరిస్థితి అంత తీవ్రంగా లేదని చెప్పారు.

ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేంద్రానికి 8 మందికి మాత్రమే పర్మిషన్ ఉండగా, 31 మంది పని చేస్తున్నారని తేలింది. అన్‌సేఫ్ లేబర్ పద్ధతుల వల్లే పేలుడు జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఫైర్‌వర్క్స్ యూనిట్లను వెరిఫై చేసి, అనుమతులు లేనివాటిని రద్దు చేయాలని సూచించారు. ఇప్పటికే డిపార్ట్‌మెంట్ అధికారులు ఈ పని చేపట్టారు.

ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, మృతులకు ఎక్స్‌గ్రేషియా, గాయాలపైకి వైద్య సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటన బాణసంచా పరిశ్రమల్లో సేఫ్టీ నిబంధనల పాటించడం అవసరమని మరోసారి గుర్తుచేసింది.

The post వేట్లపాలెం పేలుడు: 20 మృతి, మంత్రి నారాయణ హామీ appeared first on TelAndra.com.