saudi arabia Archives - TelAndra.com

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్‌కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికుల మృతి :

సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ట్యాంకర్‌ను ఢీ కొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు మృతి చెందారు. నవంబర్ 9న హైదరాబాద్ నుంచి నాలుగు ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీల (హఫ్జా, బాబాయి, రహ్మాన్ అల్ మక్కా, మహమ్మద్ భాయజాన్) ద్వారా మొత్తం 54 మంది ఉమ్రా యాత్రకు బయలుదేరారు. మక్కాలో దర్శనాలు పూర్తయిన తర్వాత 8 మంది అక్కడే ఉండగా, మిగతా 46 మంది సౌదీ ప్రభుత్వ రవాణా బస్సులో మదీనాకు బయలుదేరారు.

తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో మదీనాకు 25 కి.మీ. దూరంలోని ముఫ్రీహత్ సమీపంలో బస్సు ఎదురుగా వచ్చిన ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న డ్రైవర్, క్లీనర్, మరో వ్యక్తితో కలుపి మొత్తం 48 మంది ఉండగా, హైదరాబాద్‌కు చెందిన 46 మందిలో 45 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఒక యువకుడు మాత్రమే వెనుక తలుపు బద్దలు కొట్టి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉంది.

మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 43 మంది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి, ఇద్దరు సైబరాబాద్ పరిధి, ఒకరి పాస్‌పోర్టు హుబ్లీ అడ్రస్‌తో ఉన్నప్పటికీ హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు.

తెలంగాణ హజ్ కమిటీ 45 మంది మృతి ధృవీకరించగా, హైదరాబాద్ జాయింట్ సీపీ ఇక్బాల్ 46 మంది (హైదరాబాద్‌కు చెందినవారు) మృతి, ఒక్కడు మినహా అని తెలిపారు. మృతదేహాలు తీసుకొచ్చేందుకు రెండు దేశాల ఒప్పందాలు, డీఎన్ఏ పరీక్షలు అవసరమవడంతో ఆలస్యం కావొచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనపై తెలంగాణ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దిగ్భ్రాంతి, సంతాపం ప్రకటించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. భారత రాయబార కార్యాలయం, సౌదీ అధికారులతో సమన్వయం కొనసాగుతోంది.

The post సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం appeared first on TelAndra.com.