saree handloom Archives - TelAndra.com

చేనేత రంగం: కళకళల నుంచి కన్నీళ్ల వరకు
భారత సంస్కృతి, స్వాతంత్ర పోరాటంలో చేనేత ఎంతో కీలకం. ఆరుగజాల చీరలు ప్రపంచాన్ని ముగ్గు చేశాయి. కానీ ఇప్పుడు ఆ మగ్గాలు మూలకు చేరుతున్నాయి. ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు కష్టపడినా రోజుకి 500-1000 రూపాయలు కూడా రావడం లేదు. నెల్లూరు జిల్లా వెంకటగిరి, ఆత్మకూరు, కొవ్వూరు, పడుగుపాడు వంటి ప్రాంతాల్లో లక్షలాది మంది చేనేత కుటుంబాలు ఈ దుర్భర జీవితం అనుభవిస్తున్నాయి.

“మా ఇంట్లో అందరం కలిసి నేస్తే కూడా రోజుకి 500 రావడం లేదు సార్” అని వెంకటగిరి చేనేత కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరు “గతంలో 130 యూనిట్లకు 600 రూ. బిల్లు వచ్చేది, ఇప్పుడు 850 పైచిలుకు వస్తోంది. సగం సంపాదన కరెంట్‌కే వెళ్తోంది” అని చెప్పారు. యువత మగ్గం నేర్చుకోవడం మానేసింది. ఇతర పనుల్లో ఎక్కువ ఆదాయం, అనారోగ్యాలు, అప్పులు – ఇవన్నీ కారణం.

గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ పథకంతో ఏడాదికి 24,000 రూ. సహాయం చేసి, 100 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకం ఊసే లేదు. చంద్రబాబు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఇంకా అమలు కాలేదు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని క్యాబినెట్ చెప్పినా, నేతన్నలు ఇంకా ఎదురుచూస్తున్నారు.

నేతన్నల డిమాండ్లు స్పష్టం: నేతన్న నేస్తం వెంటనే అమలు చేయాలి, నూలు-సిల్క్‌పై 50% సబ్సిడీ, 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్యుత్, జీవిత బీమా, సహకార సంఘాలు బలోపేతం చేయాలి. వెన్ను నొప్పి, కళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లల చదువులు ఆపేస్తున్నారు.

చేనేతకు పూర్వవైభవం తీసుకురావాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ సంప్రదాయం చరిత్రలో మిగిలిపోతుంది!

The post చేనేత రంగం: కళకళల నుంచి కన్నీళ్ల వరకు appeared first on TelAndra.com.