Revanth reddy Archives - TelAndra.com

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు: స్థానిక ఎన్నికల సంస్కరణలు, వ్యవసాయ ప్రోత్సాహం

తెలంగాణ మంత్రివర్గం ఇటీవల కీలక సమావేశంలో పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిలో మార్పులు చేస్తూ, ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీ చేయకూడదనే నిబంధనను తొలగించాలని ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణతో ఎన్నికల ప్రక్రియ మరింత సరళంగా మారనుంది. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంపై దృష్టి సారించిన క్యాబినెట్, వానకాలం సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్‌ను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని ఆదేశించింది. ఈ సీజన్‌లో 80 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం ప్రొక్యూర్ చేయాల్సి ఉంటుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా, ప్రతి గింజకు మద్దతు ధర మరియు బోనస్ అందజేయాలని మంత్రివర్గం తీర్మానించింది.

మరోవైపు, వ్యవసాయ విద్యా విస్తరణకు మూడు కొత్త కళాశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కళాశాలలు ప్రారంభమవుతాయి. నగరాభివృద్ధి అంశాలపై కూడా దృష్టి పెట్టిన క్యాబినెట్, మెట్రో రైల్ విస్తరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎస్ చైర్మన్‌గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, మెట్రో రైల్ ఎండీ తదితరులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆమోదించింది. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ వ్యయంలో 33 శాతం భరించడానికి, కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్ భూసేకరణ వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ‘ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు’ నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊపిరి పోస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

The post తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు. appeared first on TelAndra.com.

కామారెడ్డి జిల్లాలో జల ప్రళయం: భారీ వర్షాలతో అతలాకుతలం
ఉదృత వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి

కామారెడ్డి జిల్లా కుండపోత వర్షాలతో అతలాకుతలమైంది. 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదై, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి పట్టణం పూర్తిగా జలమయమై, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు ఇళ్లలోకి చేరింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, సహాయం కోసం వేడుకుంటున్నారు.

నీటమునిగిన కాలనీలు, స్తంభించిన రాకపోకలు

పట్టణంలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్ సహా 10 కాలనీలు నీటమునిగాయి. కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై లక్ష్మాపూర్ వద్ద రోడ్డు కోతకు గురై, ట్రాఫిక్ స్తంభించింది. బిక్కనూరు వద్ద 44వ జాతీయ రహదారిపై వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సరంపల్లి-హైదరాబాద్ రహదారిపై వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. చెరువుల నుంచి వచ్చే వరద నీరు రోడ్లు, కాల్వలను ధ్వంసం చేసింది.

పంటలకు నష్టం, జీవనోపాధి కోల్పోయిన రైతులు

దోమకుండ, బిక్కనూరు, మాచారెడ్డి, రాజంపేట మండలాల్లో వరి, మొక్కజొన్న, సోయా పంటలు నీటమునిగాయి. వందలాది ఎకరాల్లో పంటలు ఇసుక మేటల కింద కప్పబడ్డాయి. రాజంపేటలో గోడ కూలి ఒకరు మృతి చెందగా, షేర్ శంకర్ తండాలో 100 ఆవులు వరదలో కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసరాలు తడిసి నాశనమయ్యాయి.

సహాయక చర్యలు, అధికారుల అప్రమత్తత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

రైలు రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్-కామారెడ్డి రైలు మార్గంలో పట్టాలపై వరద ప్రవహించడంతో రెండు రైళ్లు రద్దయ్యాయి, నాలుగు రైళ్లు దారి మార్చబడ్డాయి. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

The post కామారెడ్డి జిల్లాలో జల ప్రళయం: భారీ వర్షాలతో అతలాకుతలం appeared first on TelAndra.com.

తెలంగాణ సీఎం రేవంత్‌తో తెలుగు సినీ ప్రముఖుల భేటీ
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, కార్మిక సంఘం ప్రతినిధులు కలిశారు. చిత్ర పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినందుకు సీఎం రేవంత్‌ కు వారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారంపై వారు ముఖ్యమంత్రికి వివరించారు.

తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా, సినిమా షూటింగ్‌లకు అనుమతులు, ఆర్థిక సహాయం, స్టూడియోల అభివృద్ధి, కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమ పోటీతత్వాన్ని, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం తరఫున సహకారం అవసరమని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్‌, పరిశ్రమకు పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో సినిమా నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు, కార్మికుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ భేటీ సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు రాష్ట్రంలో మరింత అవకాశాలు, సౌకర్యాలు కల్పించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని నిర్మాతలు, దర్శకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

The post తెలంగాణ సీఎం రేవంత్‌తో తెలుగు సినీ ప్రముఖుల భేటీ appeared first on TelAndra.com.

సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ సర్కార్ చొరవ.
సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ సర్కార్ చొరవ :

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జోక్యం చేసుకున్నారు. ఫిల్మ్ చాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. సినీ కార్మికుల సమస్యలు తెలంగాణ సినిమా పాలసీపై ప్రభావం చూపుతాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఫిల్మ్ చాంబర్ నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో కీలక చర్చలు జరపనుంది.

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన సీఎం, ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులను ఆదేశించారు. ఈ సమస్య ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ సినీ పరిశ్రమ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో 24 యూనియన్ల నాయకులతో అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమస్యలకు పరిష్కార మార్గాలను చర్చించనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ చర్చల తర్వాత సినీ కార్మికుల సమస్యలకు స్థిరమైన పరిష్కారం దొరికే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

The post సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ సర్కార్ చొరవ. appeared first on TelAndra.com.

సామాజిక కార్యక్రమాలు మరియు గ్రామీణ ఉపాధి పథకాలు.
సామాజిక కార్యక్రమాలు మరియు గ్రామీణ ఉపాధి పథకాలు:

సర్వాయి పాపన విగ్రహ స్థాపనకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఒక చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఉపాధి మరియు వృత్తి రక్షణకు సంబంధించిన లక్ష్యాలతో విజయవంతంగా సాగింది.

గతంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మోపెట్టలు అందించేందుకు హామీ ఇచ్చినప్పటికీ, అమలు కాలేదు. ఈ రోజు, గీతా కార్మిక సంఘాలకు మోపాయడ్ల వ్యవస్థను అందించేందుకు కార్యాచరణ ప్రారంభించబడింది. అదే సమయంలో, సాంప్రదాయ తాడి చెట్ల కింద మండువాలు, ఆధునిక బార్‌ల తరహాలో కల్తీ లేని కళ్ళ మండువాలను అందించేందుకు ఆర్థిక నిధుల కేటాయింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో, 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలతో వనాలు సిద్ధంగా ఉన్నాయి. గ్రామీణ ఉపాధి పథకం కింద ఎక్సైజ్, ఫారెస్ట్, బీసీ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతోంది. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గ్రామీణ ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయి.

The post సామాజిక కార్యక్రమాలు మరియు గ్రామీణ ఉపాధి పథకాలు. appeared first on TelAndra.com.

కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ విష ప్రచారం.
కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ విష ప్రచారం :

రాజ్యాంగ విరుద్ధ ప్రచారం :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మరియు సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్ పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు “పూర్తిగా కూలిపోయింది” అని వారు ప్రభుత్వ వేదికలపై పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుష్ప్రచారానికి దారితీస్తోంది.

ఘోష్ కమిషన్ నివేదిక :

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోవడంపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక కేవలం సాంకేతిక సమస్యలపై దృష్టి సారించింది, ఇది కోర్టు తీర్పు కాదు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను తీర్పుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. 655 పేజీల నివేదికలో కేవలం 55 పేజీలను మాత్రమే ఎంపిక చేసి, వక్రీకరించిన సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

కాంగ్రెస్ కుట్రలు :

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నివేదికను బహిర్గతం చేయకుండా, ఎంపిక చేసిన భాగాలను మాత్రమే మీడియాకు అందించి, బిఆర్ఎస్ నాయకులైన కేసిఆర్, హరీష్ రావులపై ఆరోపణలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఇతర భాగాలు సురక్షితంగా ఉన్నప్పటికీ, వాటిపై విచారణ జరపకుండా, రెండు పిల్లర్ల సమస్యను ఉపయోగించి మొత్తం ప్రాజెక్టును విఫలమైనదిగా చిత్రీకరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

బిఆర్ఎస్ సవాల్ :

బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ, పూర్తి నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలో చలో కాళేశ్వరం, చలో మేడిగడ్డ కార్యక్రమాలతో ప్రజలకు నిజాలను వెల్లడిస్తామని, కాంగ్రెస్ కుట్రలకు సమాధానం చెబుతామని ప్రకటించారు.

The post కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ విష ప్రచారం. appeared first on TelAndra.com.

తెలంగాణలో క్రీడా హబ్‌ కు రేవంత్ రెడ్డి సర్కార్ సంకల్పం.
తెలంగాణలో క్రీడా హబ్‌ కు రేవంత్ రెడ్డి సర్కార్ సంకల్పం. తెలంగాణను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త స్పోర్ట్స్ పాలసీని ఆవిష్కరించింది.

హెచ్‌ఐసీసీలో జరిగిన స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాలసీని ప్రకటించారు. క్రీడల ప్రోత్సాహం, మైదానాల అభివృద్ధి, క్రీడాకారుల నైపుణ్యం, ఉద్యోగ అవకాశాల కల్పన, విదేశీ సంస్థలతో ఒప్పందాలపై ఈ పాలసీ దృష్టి సారించింది.

ప్రభుత్వం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినీ స్టేడియంలు, ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనుంది. వరంగల్‌లో క్రికెట్ స్టేడియం మంజూరు చేసినట్లు సీఎం ప్రకటించారు.

సీఎం కప్ పోటీలు, ఒలింపిక్ పతక విజేతలకు బహుమతులు, క్రీడాకారులకు రిజర్వేషన్లు, రిటైర్డ్ క్రీడాకారులకు పెన్షన్లు, కోచ్‌లకు మెరుగైన పారితోషకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాక, ఎక్స్‌క్లూసివ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు.

క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని, గతంలో నిర్లక్ష్యం వల్ల క్రీడా మైదానాలు ఫంక్షన్ హాల్స్‌గా మారాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, నిఖత్ జరీన్‌లాంటి క్రీడాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 2026లో ఇండియా గేమ్స్ నిర్వహణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒలింపియన్లు పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రలతో కాంక్లేవ్‌లో చర్చలు జరిగాయి.

The post తెలంగాణలో క్రీడా హబ్‌ కు రేవంత్ రెడ్డి సర్కార్ సంకల్పం. appeared first on TelAndra.com.

తెలంగాణ సర్కార్ బాల భరోసా : చిన్నారులకు ఉచిత వైద్య సేవలు
తెలంగాణ సర్కార్ బాల భరోసా: చిన్నారులకు ఉచిత వైద్య సేవలు :

తెలంగాణ సర్కార్  చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం ‘బాల భరోసా’ కార్యక్రమంపై కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఐదేళ్ల లోపు పిల్లలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించాలని సర్కార్ నిర్ణయించింది.

ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు సకాలంలో వైద్య సహాయం అందించి, వారి భవిష్యత్తును సురక్షితం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం కింద, ఐదేళ్ల లోపు పిల్లలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు.

గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, జన్మస్థిత వైకల్యాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత శస్త్రచికిత్సలు చేయనున్నారు.

ఈ పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలకు పెద్ద ఊరట కల్పించనుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందితో సమన్వయం చేస్తోంది. అర్హత గల పిల్లలను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తాయి.

తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, పిల్లలను సమీప ఆస్పత్రులకు తీసుకెళ్లేలా ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తును బలోపేతం చేయడంతో పాటు, తెలంగాణ సర్కార్ బాలల సంక్షేమంపై తీసుకున్న చొరవను ప్రదర్శిస్తోంది.

ఈ కార్యక్రమం పిల్లల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురానుందని, ఆరోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులకు కొత్త ఆశలు చిగురించనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

The post తెలంగాణ సర్కార్ బాల భరోసా : చిన్నారులకు ఉచిత వైద్య సేవలు appeared first on TelAndra.com.

జూబిలీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు ఇక లేరు.
జూబిలీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు మృతి :

తెలంగాణలో జూబిలీహిల్స్ నియోజకవర్గానికి చెందిన BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు తుది శ్వాసను విడిచారు. మాగంటి గోపినాథ్ గారు గత కొన్ని రోజుల గా ఆరోగ్య సమస్య తో గచ్చిబౌలి AIG హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా జూన్ 8 2025 ఉదయం 5.45 నిమిషాలకు గుండె పోటుతో మృతి చెందారు. గత సంవత్సరంగా గోపినాథ్ గారు అనారోగ్య సమస్యలు కారణంగా AIG హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు,కిడ్నీ సమస్య కూడా ఉండడం తో డయాలసిస్ కూడా తీస్కుంటున్నారు. ఈ సమయం లోనే వారికీ హార్ట్ ఎటాక్ రావడం తో చనిపోయారు.

మాగంటి గోపినాథ్ గారు 1963 జూన్ 2 న హైదర్‌గూడ లో కృష్ణమూర్తి, మహానంద కుమారి గార్లకి జన్మించారు. 1980 లో ఇంటర్మీడియట్, 1983 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. గోపినాథ్ గారికి సునీత గారితో వివాహామైయింది. వారికీ ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన రోజుల్లో తెలుగు దేశం పార్టీ లోఆయన రాజకీయ ప్రస్థానం మొదలయింది. 1985 నుంచి 1992 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి తెలుగు యువత అధ్యక్షులు గా ఉన్నారు. 1987 నుంచి 1988 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా పనులు చేపట్టారు. 2014 లో మొట్ట మొదటి సారి టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు. తరువాత 2018 మరియు 2023 లో బీఆర్ఎస్ ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే హోదా లో ఉన్నారు, గోపినాథ్ గారి మరణం బీఆర్ఎస్ కి తీరని లోటు.

చాల చిన్న వయసు లో రాజకీయం లో కి అడుగు పెట్టిన గోపినాథ్ గారికి చాల మంది తో మంచి అనుబంధం ఉంది రాజకీయాల్లో మంచి పేరు ఉంది, జూబిలీ హిల్స్ నియోజకవర్గం లో ఉన్న ఆయన బస్తి లో ఉన్న ప్రజలకి ఏ లోటు లేకుండా అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకున్నారు, బస్తి లో ఉన్న నీటి కొరత ను గుర్తించి వారికి నీటి సదుపాయాలని ఇచ్చారు. మాస్ లీడర్ గా గుర్తింపు తెచుకున్నారు, కేటీఆర్ కి సన్నిహితుడు గా, కేసీఆర్ కి శిష్యుడు గా రాజకీయాలో వారికంటూ చెరగని ముద్ర వేసుకున్నారు.

గోపినాథ్ గారి మరణ వార్త విని సీఎం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి ని ప్రకటించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలిపారు. గోపినాథ్ మృతదేహాన్ని చూడగానే కన్నీరు పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్, వారి కుటుంబాన్ని పరామర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి గారు గోపినాథ్ గారి అంత్యక్రియల బాధ్యత అంత ప్రభుత్వమే చేపడుతుంది అని చెప్పారు. వారి అంతిమ యాత్ర లో కేటీఆర్ మరియు హరీష్ రావు గారు స్వయంగా  వారి పాడె ను మోసి నివాళులు అర్పించ్చారు. మధ్యాహ్నం 3 – 4 గంటలకు జూబిలీ హిల్స్ మహాప్రస్థానం వద్ద ఏర్పాటు చేసారు భౌతిక దేహాన్ని మాదాపూర్ నివాసం నుంచి ర్యాలీ చేస్తూ మహాప్రస్థానం వరకు తరలించారు. అంత్యక్రియలు కార్యక్రమం లో పోలీస్ లు గౌరవ వందనాలు మూడు రౌండ్లు కాల్పులు ఘనంగా పేల్చారు.

The post జూబిలీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు ఇక లేరు. appeared first on TelAndra.com.

తెలంగాణలో దుష్టశక్తులను వెళ్లగొట్టాలి : సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలో దుష్టశక్తులను వెళ్లగొట్టాలి : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ను దయ్యాల రాజ్య సమితి (డీఆర్ఎస్) అని తీవ్రంగా విమర్శించారు. పార్టీలో దెయ్యాలు చేరాయని సొంత నాయకులు చెబుతుంటే, బీఆర్ఎస్ నేతలు నోరు మెదపలేక, వారి నాయకుడు ఫామ్‌హౌస్‌లో నిశ్శబ్దంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఈ దుష్టశక్తులను రాష్ట్ర సరిహద్దుల దాటే వరకు తరిమేస్తామని, ఈ బాధ్యతను తాను స్వీకరిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఒక్క నోటీసుతో కేసీఆర్ బెదిరిపోతున్నాడని, జైలు జీవితం అనుభవించిన తాము భయపడేది లేదని సవాల్ విసిరారు.

కాళేశ్వరం కమిషన్ నోటీసులకు బీఆర్ఎస్ నేతలు ప్రతిదాడి చేస్తున్నారని, అది కాంగ్రెస్ కమిషన్ కాదని రేవంత్ స్పష్టం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా కోర్టు ఆదేశాలకు లొంగారని గుర్తు చేశారు. గత దశాబ్దంలో రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వారు ఇప్పుడు వెనక్కి తగ్గాలని ఆయన డిమాండ్ చేశారు. తన వ్యక్తిగత లక్ష్యాలు సాధించినా, ఇక తెలంగాణ ప్రజల కోసం కృషి చేయాలని, నల్గొండ రైతుల సమస్యలను పరిష్కరించాలని, గోదావరి జలాలతో మూసీ నదిని నింపాలని రేవంత్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తే, పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నాలను తిప్పికొడతామని హెచ్చరించారు.

The post తెలంగాణలో దుష్టశక్తులను వెళ్లగొట్టాలి : సీఎం రేవంత్ రెడ్డి. appeared first on TelAndra.com.