pawan kalyan Archives - TelAndra.com

ఓజి: పవన్ ఫ్యాన్స్‌కు యాక్షన్ పండగ.
పవన్ కళ్యాణ్ అభిమానులు గత కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజి’. ప్రొడక్షన్ దశ నుండే భారీ అంచనాలు ఏర్పడిన ఈ మూవీ, హైప్‌కు తగ్గట్టుగా కంటెంట్‌తో వచ్చిందా? అభిమానుల ఆశలు తీర్చిందా? అనేది చూద్దాం.

కథ 1940లలో జపాన్‌లో మొదలై 1980లలో ముంబైకి చేరుతుంది. జపాన్ నుండి ముంబై వచ్చే క్రమంలో సత్యదా (ప్రకాష్ రాజ్)కు ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) సహాయం చేసి పరిచయమవుతాడు. సత్యదా బాంబేలో పోర్టు నడుపుతుంటాడు, ఓజస్ దానికి సంరక్షకుడు. పోర్టులో RD X కంటైనర్ మిస్ అవడంతో సత్యదా మాజీ పార్ట్‌నర్ కొడుకు ఓమి (ఇమ్రాన్ హాష్మి) రంగంలోకి దిగి సత్యదా కుమారుడిని చంపేస్తాడు. ఇప్పటికే సత్యదాకు దూరమై, భార్య కమని (ప్రియాంక మోహన్)తో అజ్ఞాత జీవితం గడుపుతున్న ఓజస్, సత్యదా కుటుంబానికి ఎందుకు దూరమయ్యాడు? సమస్యల్లో చిక్కుకున్న సత్యదాకు మళ్లీ వస్తాడా? గంభీర vs ఓమి ఫేసాఫ్ ఎలా ఉంటుంది? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాలి.

దర్శకుడు సుజిత్, పవన్ ఫ్యాన్‌గా అభిమానుల ఆకలి అర్థం చేసుకుని ఈ సినిమా రాసుకున్నాడు. కథ సాధారణమే అయినా, స్క్రీన్‌ప్లేలో ఎలివేషన్స్ జోడించి మెరుగుపరిచాడు. మారుతున్న టైమ్ ఫ్రేమ్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ చేసినా, ఓవరాల్ కంటెంట్ మెప్పిస్తుంది. తమన్ బీజీఎం, పాటలు సినిమాను నిలబెట్టాయి. ఫస్ట్ హాఫ్ స్టోరీ స్లోగా సాగినా, సెకండ్ హాఫ్ క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్. సెకండ్ హాఫ్ మొదటి 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ వైలెన్స్‌తో ఉంది. పోలీస్ స్టేషన్ సీన్ హైలైట్. కానీ తర్వాత రొటీన్ అయింది. ఎలివేషన్స్ కామన్‌గా అనిపించాయి. ఎమోషన్స్ అంతగా వర్కవుట్ కాలేదు. సాహోతో కనెక్షన్ ఒక హై మూమెంట్ కోసమే.

పవన్ కళ్యాణ్ ఓజి క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేశాడు. ఫస్ట్, సెకండ్ హాఫ్ వేరియేషన్ సూపర్. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హాష్మి, ప్రియాంక మోహన్ మెప్పించారు. తమన్ మ్యూజిక్ హైలైట్. రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ, 1980ల బాంబే టింట్ అద్భుతం. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ ఆథెంటిక్. డివివి దానయ్య నిర్మాణ విలువలు అన్‌కాంప్రమైజ్డ్.

సుజిత్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు. కానీ కథా కథనాలపై మరిన్ని ఈవెంట్స్ ఉంటే మరింత బెటర్. ఓవరాల్, ‘ఓజి’ అభిమానులకు పండగ. యాక్షన్ లవర్స్‌ను అలరిస్తుంది. జనరల్ ఆడియన్స్ లిమిటెడ్ అంచనాలతో వెళ్తే ఎంజాయ్ చేయవచ్చు.

The post ఓజి: పవన్ ఫ్యాన్స్‌కు యాక్షన్ పండగ. appeared first on TelAndra.com.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ: గ్యాంగ్‌స్టర్ డ్రామాతో సంచలనం
ముంబై నేపథ్యంలో ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’, హరిహర వీరమల్లు తర్వాత అభిమానులను ఆకట్టుకోనుంది. ముంబై నేపథ్యంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను దర్శకుడు సుజిత్ ఉత్సాహంతో తీర్చిదిద్దుతున్నాడు. అభిమాని హోదాలో సుజిత్, పవన్‌ను ఒక శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌గా ఆవిష్కరిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

హంగ్రీ చీతా, మెలోడీ సాంగ్‌తో హైప్

ఇప్పటికే విడుదలైన ‘హంగ్రీ చీతా’ గ్లింప్స్ అభిమానుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మొదటి సింగిల్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించగా, వినాయక చవితి సందర్భంగా విడుదలైన ‘సువ్వి సువ్వి’ మెలోడీ అందరినీ ఆకర్షించింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తోంది. కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్‌కు శృతి రంజని గాత్రం అదనపు ఆకర్షణ.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ 25 విడుదల

‘ఓజీ’ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రమోషన్‌లు జోరందుకున్నాయి, త్వరలో ట్రైలర్ విడుదలకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీగా నిర్మిస్తున్నారు.

అభిమానుల అంచనాలు

మొదటి సింగిల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా, ‘సువ్వి సువ్వి’ పాట సామాన్య ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది. హరిహర వీరమల్లుతో నిరాశపరిచిన పవన్, ‘ఓజీ’తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు.

The post పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ: గ్యాంగ్‌స్టర్ డ్రామాతో సంచలనం appeared first on TelAndra.com.

విశాఖలో సేనతో సేనాని: పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన
ఘన స్వాగతంతో జనసేన కార్యకర్తల ఉత్సాహం

విశాఖలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల ‘సేనతో సేనాని’ కార్యక్రమం కోసం విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖలో సంపత్ వినాయక ఆలయం వద్ద వీరమహిళలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులోని ఓ హోటల్‌కు చేరుకున్న పవన్, రాష్ట్రస్థాయి సమావేశాలతో పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు సిద్ధమయ్యారు.

విశాఖలో మూడు రోజుల సమావేశాలు

ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 30న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ జరగనుంది, దీనికి సుమారు 14,000 మంది కార్యకర్తలు హాజరవుతారని అంచనా. పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో విజయ వ్యూహాలు, కూటమి భాగస్వాములతో సమన్వయం వంటి అంశాలపై చర్చలు జరుగనున్నాయి.

పార్టీ లక్ష్యాలపై దృష్టి

పవన్ కళ్యాణ్ ఈ సమావేశాల ద్వారా పార్టీ సిద్ధాంతాలను, ప్రజల సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యంగా చర్చించనున్నారు. జనసేన కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తూ, రాష్ట్రంలో రాజకీయ ఉనికిని బలోపేతం చేయడానికి కృషి చేయనున్నారు. ఈ కార్యక్రమం జనసేనకు కొత్త ఉత్తేజాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

The post విశాఖలో సేనతో సేనాని: పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన appeared first on TelAndra.com.

పవన్ కళ్యాణ్ సినిమా స్పీడ్: రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ జోరు
పవన్ కళ్యాణ్ తలచుకుంటే అసాధ్యం ఏమీ లేదు. జనసేన పార్టీ నడపడానికి నిధుల కోసం సినిమాలపై దృష్టి పెట్టిన ఆయన, అద్భుతమైన వేగంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. గతంలో ఒక సినిమాకు ఐదేళ్లు తీసుకున్న పవన్, ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ను 15 రోజుల్లో ముగించారు. ‘ఓజి’ షూటింగ్ గతంలోనే పూర్తయింది. ఇటీవల మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్లైమాక్స్‌ను కూడా వేగంగా ఫినిష్ చేశారు.

కేవలం 10% పూర్తైన ‘ఉస్తాద్’ను పక్కనపెడతారన్న ప్రచారాన్ని తిప్పికొట్టి, కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. 2027 వరకు మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధమైన పవన్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తల్లూరి నిర్మాణంలో మరో చిత్రానికి కమిట్ అయ్యారు. ‘ఏజెంట్’ విఫలమైనా, ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు. పవన్ సినిమా ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి!

The post పవన్ కళ్యాణ్ సినిమా స్పీడ్: రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ జోరు appeared first on TelAndra.com.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంకంరెడ్డి ఆగ్రహం.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంకంరెడ్డి ఆగ్రహం – తాడేపల్లిలో కేసు నమోదు :

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేసిన వైసీపీ నేత నారాయణ మూర్తి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. నిన్న జరిగిన హరి హర వీర మల్లు సక్సెస్ మీట్ లో పవన్  మాట్లాడాడుతూ అభిమానులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారని వైసీపీ నేతలు వారి పై కేసు ను నమోదు చేశారు.

వైసీపీ నేత నారాయణ మూర్తి మాట్లాడుతూ – ఫాన్స్ ను రెచ్చగొట్టేలా మాట్లాడారు, కొట్టేయండి నమిలేయండి మీకు నచ్చినట్టు చేయండి అంటూ వారు అన్న మాటలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఫిర్యాదు లో పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం వ్యాఖ్యల వల్లే జనసేన నాయకులూ వైసీపీ నేతల కార్ల మీద దాడి చేశాడంటూ YCP నేతలు ఆరోపించారు. వారు ఇలా మాట్లాడటం వైసీపీ నేతలను అవమానించారని దీనికి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.

తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ని స్వీకరించినప్పటికీ కేసు ను నమోదు చేసారా లేదా అన్న దాని పై స్పష్టత లేదు. గతం లో కూడా వైసీపీ నాయకులూ పవన్ కళ్యాణ్ పై వివిధ సందర్బాల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా రాజకీయ విమర్శలు, కేసులు కొనసాగుతూనే ఉన్నాయి.

The post పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంకంరెడ్డి ఆగ్రహం. appeared first on TelAndra.com.

రోజా సంచలన వ్యాఖ్యలు : చంద్రబాబు, పవన్‌పై ఘాటు విమర్శలు.
రోజా సంచలన వ్యాఖ్యలు – చంద్రబాబు, పవన్‌పై ఘాటు విమర్శలు :

నగరిలో జరిగిన ‘రీకాలింగ్ చంద్రబాబు’ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ‘గాలిలో గెలిచినవాళ్లే’ అని, ప్రజల కష్టాలను అడిగేందుకు రైతుల దగ్గరకు వెళ్లరని ఆమె విమర్శించారు.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను ‘వీకెండ్ నాయకులు’ అని ఎద్దేవా చేస్తూ, వారు ప్రజల సమస్యలను పట్టించుకోరని ఆరోపించారు.

రోజా మాట్లాడుతూ, “చంద్రబాబు లెక్కలు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్‌కు పిచ్చి ముదిరిపోయింది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు వీడియో రూపంలో వెలుగులోకి రావడంతో కూటమి నాయకులు తీవ్రంగా స్పందించారు.

ప్రెస్ మీట్‌లో కూటమి నాయకులు, “రైతులు సంతోషంగా ఉన్నారు, మామిడి రైతులకు మద్దతు ధర ఇస్తున్నాం. రోజాకు, జగన్‌కు పిచ్చి ఉంది, అందుకే మమ్మల్ని తిడుతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోజా ఇంకా విమర్శలు కొనసాగిస్తూ, “గోవులు, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోతున్నా ఈ నాయకులు పట్టించుకోలేదు. పవన్ తమిళనాడుకు వెళ్లి ‘అక్కడే పుట్టాను’ అంటారు, గుంటూరు, ఒంగోలు, పిఠాపురంలోనూ అదే మాట. అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారు” అని ఎద్దేవా చేశారు.

“పవన్ వీకెండ్‌లకు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు వస్తారు, మిగిలిన సమయంలో షూటింగ్‌లతో బిజీ” అని ఆమె విమర్శించారు.

హెచ్చరికలు జోడిస్తూ, “ఇప్పుడు ఈ నాయకులు హైదరాబాద్‌కు పారిపోతున్నారు. జగన్ ప్రభుత్వం వస్తే అమెరికాకు పారిపోతారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను టార్చర్ చేస్తే, రేపు వడ్డీతో తిరిగి ఇస్తాం” అని రోజా సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.

The post రోజా సంచలన వ్యాఖ్యలు : చంద్రబాబు, పవన్‌పై ఘాటు విమర్శలు. appeared first on TelAndra.com.

హరి హర వీరమల్లు – పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా విజువల్ ట్రీట్.
హరి హర వీరమల్లు – పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా విజువల్ ట్రీట్:

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీర మల్లు’ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత, డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం హరి హర వీరమల్లు కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, విడుదల తర్వాత సినిమాపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.

మొదటి సగంలో పవన్ కళ్యాణ్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆయన పరిచయ సన్నివేశం, కుస్తీ యాక్షన్ సీన్స్, ఎలివేషన్ షాట్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి.

ఎం.ఎం. కీరవాణి సమకూర్చిన సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది, ముఖ్యంగా పవన్ ఎలివేషన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు.

మొదటి సగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే, ఇంటర్వెల్ తర్వాత కథ నెమ్మదిగా సాగింది. కథనం లాగినట్లు అనిపించడంతో పాటు క్లైమాక్స్ బలహీనంగా ఉందని అభిమానులు భావించారు.

విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కూడా నీరసంగా ఉన్నాయి, కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పాతబడినట్లు కనిపించాయి.అయినప్పటికీ, కథ బాగున్నప్పటికీ దర్శకుడు పవన్ కళ్యాణ్‌ను మరింత ఆకర్షణీయంగా చూపించడంలో విఫలమయ్యాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ, హరి హర వీర మల్లు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన కలెక్షన్లతో విజయవంతంగా రాణించింది.

The post హరి హర వీరమల్లు – పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా విజువల్ ట్రీట్. appeared first on TelAndra.com.

హరి హర వీరమల్లు – ట్రైలర్ ఊహించని సంచలనం.
హరి హర వీరమల్లు:

అభిమానుల అంచనాలని పెంచేసిన ట్రైలర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్న “హరి హర వీరమల్లు” సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడైతే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూసిన తర్వాత, సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ పిరియడ్ యాక్షన్ డ్రామాను ఏ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ సినిమా జూలై 24, 2025న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న అభిమానులకి ఫీస్ట్ గా “హరి హర వీరమల్లు” ట్రైలర్ ని జూలై 3, 2025న విడుదల చేసారు. దాదాపు 2 నిమిషాల 57 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్, విజువల్స్, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం. అన్నీ కలిసి మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయాయి.

ట్రైలర్ మొదట్లోనే “హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం” అనే పవర్ఫుల్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. దీన్ని బట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఒక ధైర్యవంతుడైన బందిపోటు యోధుడి కథ గా చిత్రీకరించారు.

పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు పాత్రలో జీవించేశారు అనడంలో సందేహమే లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్, కత్తియుద్ధాలు, యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ‘ఆంధి వచ్చేసింది’ అని చెప్పే డైలాగ్ అయితే హైలైట్. నిధి అగర్వాల్ కథానాయికగా పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ జోడీగా కనిపించిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

జ్ఞాన శేఖర్, మనోజ్ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ అయితే అద్భుతం. భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన ప్రతి షాట్ కూడా కనుల పండుగే. ఎమ్.ఎమ్. కీరవాణి గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ట్రైలర్ కు ప్రాణం పోసింది. పాటలు ఇప్పటికే విడుదలయ్యి మనందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మొత్తానికి, హరి హర వీరమల్లు ట్రైలర్ చూశాక సినిమా బ్లాక్ బస్టర్ అవడం పక్కా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. భారీ బడ్జెట్ తో, అద్భుతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు, సినీ ప్రియులకు ఒక గొప్ప అనుభూతినిస్తుందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా కోసం ఇక వెయిటింగ్.

The post హరి హర వీరమల్లు – ట్రైలర్ ఊహించని సంచలనం. appeared first on TelAndra.com.

విడుదల కాబోతున్న హరి హర వీర మల్లు
పవన్ కళ్యాణ్ అభిమానుల ఆతృతను తీర్చే ఆ శుభదినం ఎట్టకేలకు ఆసన్నమైంది! ఎన్నో రోజుల నిరీక్షణకు ఫలితంగా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీర మల్లు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం మే 9 న అభిమానుల హృదయాలను ఆకట్టుకోవడానికి సర్వం సన్నద్ధంగా ఉంది.

ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం, ఒక ఆకర్షణీయమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ యొక్క అసాధారణ నటనతో పాటు, ఈ చిత్రం దృశ్య వైభవం మరియు ఉద్వేగభరిత కథాంశంతో ప్రేక్షకులను అలరించనుంది.

మెగా ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత సామ్రాట్ ఎం.ఎం. కీరవాణి స్వరకల్పన ఈ చిత్రానికి ప్రాణం పోసింది.

ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి. మొదటి పాట ‘మాట వినాలి’ జనవరి 15, 2025న, రెండవ పాట ‘కొల్లగొట్టినాదిరో’ ఫిబ్రవరి 24, 2025న విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ భారీ తారాగణం, శక్తివంతమైన కథనంతో కూడిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమనులో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

‘హరి హర వీర మల్లు’ ఒక సినిమాటిక్ పండగగా మారి, తెలుగు సినిమా ప్రేమికులకు అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి మీరు కూడా ఎదురుచూస్తున్నారా?

The post విడుదల కాబోతున్న హరి హర వీర మల్లు appeared first on TelAndra.com.