OPERATION SINDHOOR Archives - TelAndra.com

ఆపరేషన్ సింధూర్ గణేష్: హైదరాబాద్‌లో దేశభక్తి దైవభక్తి సమ్మేళనం
ఆపరేషన్ సింధూర్ గణేష్, హైదరాబాద్‌లో గణేష్ చతుర్థి వేడుకలు వినూత్నంగా దేశభక్తితో కలిసి సందడి చేస్తున్నాయి. ఓల్డ్ సిటీలోని లలితాబాగ్‌లో మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ సింధూర్’ గణేష్ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహం దేశభక్తి, దైవభక్తి సమ్మేళనంగా నిలుస్తూ, పాకిస్తాన్‌పై దాడి తర్వాత జెట్ నుంచి దిగిన వ్యోమికా సింగ్ ఉద్విగ్న క్షణాలను వినాయకుడి రూపంలో అద్భుతంగా చిత్రీకరించారు.

విఘ్నేశ్వర సాయిధామంలో ఏర్పాటైన ఈ మంటపం యుద్ధరంగంలా కనిపిస్తుంది. బ్రహ్మోస్, ఎస్400 క్షిపణులు, భారతదేశ భూపటం చుట్టూ ఆర్మీ జవాన్లుగా మూషికాలు నిలబడి ఉన్నాయి. ఈ కాన్సెప్ట్‌ను వివరించే 20 నిమిషాల వీడియోను నవరాత్రుల్లో ప్రొజెక్టర్‌పై ప్రదర్శిస్తారు. ఈ వీడియో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అర్థమయ్యేలా రూపొందించారు.

‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌ను ఎంచుకోవడం వెనుక మహిళా శక్తిని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశం ఉంది. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు మహిళలు విజయవంతంగా పాల్గొన్నారు. 49 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న ఈ అసోసియేషన్, 2023లో చంద్రయాన్ థీమ్‌తో విగ్రహాన్ని రూపొందించగా, ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్ ఎంచుకున్నారు. రాజేంద్రనగర్‌లో రూ.15 లక్షలతో తయారైన ఈ విగ్రహానికి ఇప్పటివరకు రూ.10 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కాన్సెప్ట్ పండుగలకు కొత్త అర్థాన్ని ఇస్తూ, భక్తితో పాటు విజ్ఞానం, దేశభక్తిని చాటుతోంది. హైదరాబాదీలు మరోసారి తమ సృజనాత్మకతతో గణపతిని ట్రెండింగ్‌గా మార్చారు.

The post ఆపరేషన్ సింధూర్ గణేష్: హైదరాబాద్‌లో దేశభక్తి దైవభక్తి సమ్మేళనం appeared first on TelAndra.com.

ఆపరేషన్ సింధూర్‌ పై పార్లమెంటులో చర్చ.
ఆపరేషన్ సింధూర్‌ పై పార్లమెంటులో చర్చ :

సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో ‘ ఆపరేషన్ సింధూర్ ’ పై చర్చ జరగనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభిస్తారు.

హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జయశంకర్‌తో పాటు బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దుబే పాల్గొంటారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ చర్చలో మాట్లాడే అవకాశం ఉంది. రెండు సభల్లోనూ 16 గంటల పాటు ఈ అంశంపై చర్చ జరుగనుంది.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అన్ని అంశాలపై ఒకేసారి చర్చ సాధ్యం కాదని, ముందుగా ఆపరేషన్ సింధూర్‌పై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రతిపక్షాలు బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి.అయితే, మొదట ఆపరేషన్ సింధూర్‌పై చర్చ పూర్తి చేసిన తర్వాత ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని రిజిజు స్పష్టం చేశారు.

గత ఐదు రోజులుగా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఆందోళనల కారణంగా ఎలాంటి చర్చలు జరగలేదు. సభ పలుమార్లు వాయిదా పడింది.ఈ నేపథ్యంలో, సోమవారం నుంచి సభను సజావుగా నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

ఆపరేషన్ సింధూర్‌పై చర్చలో పాకిస్తాన్‌కు సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలు, భారత్‌పై జరిగిన దాడుల వివరాలను పార్లమెంట్ వేదికగా చర్చించనున్నారు.

విదేశీ వేదికలపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందని, ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని రిజిజు తెలిపారు.

ప్రతిపక్షాలు దళితులపై దాడులు, విదేశీ విధానం వంటి ఇతర అంశాలపై కూడా చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్‌పైనే ప్రభుత్వం దృష్టి సారించింది.

The post ఆపరేషన్ సింధూర్‌ పై పార్లమెంటులో చర్చ. appeared first on TelAndra.com.

ఆపరేషన్ సిందూర్ పై భారత్ ప్రధాని వివరణ .
ఆపరేషన్ సిందూర్:

ఆపరేషన్ సిందూర్ తర్వాత జాతిని ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు సోమవారం మాట్లాడుతూ, ఈ సందర్భంగా మన దేశ సైన్యానికి, గూఢచార సంస్థలకు, శాస్త్రవేత్తలకు, ప్రతి భారతీయుడి తరపున శిరసు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. దేశంలోని మహిళల నుదిటి నుండి ‘సిందూర్’ (సిందూర్) లాక్కుంటే ఏమి జరుగుతుందో భారతదేశం ప్రపంచానికి తెలియజేసింది అన్నారు.

పహల్గామ్ దాడి:

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఉగ్రవాదం యొక్క అనాగరిక ముఖంగా అభివర్ణించిన, సెలవులు జరుపుకుంటున్న నిరపరాధులను, వారి కుటుంబాల ముందు, పిల్లల ముందు కిరాతకంగా హతమార్చడం ఉగ్రవాదం యొక్క దిగ్భ్రాంతికర రూపాన్ని చూపింది. “అది తనకు వ్యక్తిగతంగా చాలా బాధని కలిగించింది అన్నారు”.

ఈ దాడి తర్వాత దేశం మొత్తం, ప్రతి పౌరుడు, సమాజం, రాజకీయ పక్షలు ఏకతాటిపై నిలిచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది అన్నారు.

న్యాయం కోసం యుద్ధం :

మే 7న పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు మరియు డ్రోన్‌లతో కూడిన దాడులతో ప్రారంభమైన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రత్యక్ష ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్‌ను మోదాహాలు పెట్టిన భరత్ . ఈ ఆపరేషన్‌లో భాగంగా, 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాము అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం పేరు కాదు. ఇది దేశంలోని లక్షలాది మంది ప్రజల భావాలను ప్రతిబింబిస్తుంది . ఇది న్యాయం కోసం చేసిన అవిచ్ఛిన్న ప్రతిజ్ఞ.

ఫౌలాదీ నిర్ణయాలు :

దేశం ఏకమై, ‘నేషన్ ఫస్ట్’ భావనతో నిండినప్పుడు, ఫౌలాదీ నిర్ణయాలు తీసుకోబడతాయి. భారత మిస్సైళ్లు, డ్రోన్‌లు పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసినప్పుడు, ఉగ్రవాద సంస్థల భవనాలతో పాటు వారి ధైర్యం కూడా వణికిపోయింది. బహవల్పూర్, మురీద్ వంటి ఉగ్ర శిబిరాలు గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీలుగా ఉండేవి. భారత్‌లో దశాబ్దాలుగా జరిగిన భారీ ఉగ్ర దాడుల వెనుక ఈ శిబిరాల పాత్ర ఉంది. మన సోదరీమణుల సిందూరాన్ని ఉగ్రవాదులు నాశనం చేశారు, కానీ భారత్ ఈ ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేసింది.పాకిస్తాన్ ఆర్మీ భారత్ కి వ్యతిరేకంగా ఉగ్రవాదులు పెంచిపోషిస్తుంది అన్నారు.ఉగ్రవాదులు మరణిస్తే పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కంట తడి పెట్టింది అన్నారు.

భయాందోళన లో పాకిస్థాన్ :

భారత్ త్రివిధ దళాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన తరువాత ఉగ్రవాదాన్ని అంతు చేయాల్సిన పాకిస్థాన్ మన పై ఎదురు దాడి చేసింది ఐతే పాకిస్థాన్ డ్రోన్స్ భారత్ లో కి రాలేకపోయాయి .కానీ మనం పాకిస్థాన్ గుండెల్లో బాంబు పేల్చాము పాక్ లో ని ఎయిర్ బేస్ లకు తీవ్రంగా నష్టం చేసాం పాకిస్థాన్ వాయు రక్షణ వ్యవస్థను నిర్మూలంగా నాశనం చేసాము ఈ దెబ్బ తో బెంబేలెత్తి పోయిన పాకిస్తాన్ శాంతి కోసం అంతర్జాతీయంగా వేడుకోవడం మొదలుపెట్టింది.

కొత్త లక్ష్యాలు :

మే 10న పాకిస్తాన్ సైన్యం మన డీజీఎంఓను సంప్రదించి, ఇకపై ఉగ్రవాద చర్యలు, సైనిక దుస్సాహసాలు ఉండవని హామీ ఇచ్చింది. అందుకే, మేము మా జవాబు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశాము. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదం అణ్వాయుధ పేరుతో బెదిరింపులను కి దిగితే . భారతదేశం ఆటువంటి “అణు బ్లాక్‌మెయిల్”ను సహించదని, పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ను కేవలం నిలిపివేసామ్ పాకిస్తాన్ ప్రవర్తనను ఈ కోణంలో పరిశీలిస్తాము. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అప్రమత్తంగా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ యొక్క కొత్త విధానం. ఇది ఉగ్రవాదంతో పోరాడటానికి కొత్త ప్రమాణాలను నిర్దేశించింది.

మూడు కీలక సూత్రాలు :

1.  భారత్‌పై ఉగ్ర దాడి జరిగితే, ముఖం తడమకుండా జవాబు ఇస్తాము. మా నిబంధనలతో, మా విధానంలో చర్య తీసుకుంటాము.

2.  అణ్వాయుధ బెదిరింపులను భారత్ సహించదు. అటువంటి బెదిరింపుల ఆడ ఉగ్ర శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేస్తాము.

3.  ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇచ్చే ప్రభుత్వాలను, ఉగ్రవాద నాయకులను వేరుగా చూడము.

మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల శక్తి :

ఈ ఆపరేషన్‌లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. 21వ శతాబ్దపు యుద్ధ సాంకేతికతలో భారత రక్షణ సామగ్రి తన స్థానాన్ని సుస్థిరం చేసింది. రణరంగంలో పాకిస్తాన్‌ను పదే పదే ఓడించిన భారత్, ఈ సారి ఆపరేషన్ సిందూర్‌తో కొత్త ఒరవడిని సృష్టించింది.

ఐక్యతే మన బలం :

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన ఐక్యతే మన గొప్ప బలం. ఈ యుగం యుద్ధానిది కాదు, కానీ ఉగ్రవాదానిది కూడా కాదు. ఉగ్రవాదంపై సున్నా సహనం మానవాళికి మంచి భవిష్యత్తును అందిస్తుంది. పాకిస్తాన్ తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయకపోతే, అది తనను తాను నాశనం చేసుకుంటుంది. భారత్ యొక్క విధానం స్పష్టం—ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాగవు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి నడవవు. రక్తం, నీరు ఒకే మార్గంలో ప్రవహించవు.

శాంతి కోసం శక్తి :

ఈ రోజు బుద్ధ పూర్ణిమ. భగవాన్ బుద్ధుడు శాంతి మార్గాన్ని చూపించారు. కానీ శాంతి కూడా శక్తి ద్వారానే సాధ్యమవుతుంది. భారత స్వప్నం సాకారం కావాలంటే, భారతం శక్తివంతంగా ఉండాలి. గత కొన్ని రోజుల్లో భారత్ ఈ శక్తిని ప్రదర్శించింది. మరోసారి భారత సైన్యానికి, సశస్త్ర బలగాలకు సలాం చేస్తూ, ప్రతి భారతీయుడి ఐక్యతా సంకల్పాన్ని నమస్కరిస్తున్నాను.

The post ఆపరేషన్ సిందూర్ పై భారత్ ప్రధాని వివరణ . appeared first on TelAndra.com.

భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తత: సింధూర్ 2.0
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాతో సహా సరిహద్దు ప్రాంతాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్ సైన్యం నిర్విరామంగా దాడులకు పాల్పడుతుండగా, భారత సైన్యం దీటుగా స్పందిస్తూ పాక్ దాడులను తిప్పికొడుతోంది.

ఈ ఘర్షణల్లో భారత సైనికుడు మురళి నాయక్ వీరమరణం పొందారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందినవారు.

జమ్మూ కాశ్మీర్‌లో దాడులు

పూంచ్ జిల్లాలో పాకిస్థాన్ భారీ కాల్పులు జరిపింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనతో బంకర్లలో తలదాచుకున్నారు. యూరి సెక్టార్‌లో పాక్ సైన్యం దాడులు చేసి, పలు నివాసాలను ధ్వంసం చేయగా, ఒక పౌరుడు మృతి చెందారు. భారత సైన్యం పాక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది.

సైనిక చర్యలు

భారత సైన్యం పాకిస్థాన్‌కు చెందిన ఒక F-16, రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఒక పాక్ పైలట్‌ను సజీవంగా అదుపులోకి తీసుకుంది. అలాగే, 50 డ్రోన్‌లను నాశనం చేసింది. సరిహద్దులో 12 ప్రాంతాల్లో దాడులకు యత్నించిన పాక్ సైన్యాన్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది.

భారత్ యొక్క ప్రతిదాడి

భారత త్రివిధ దళాలు పాకిస్థాన్‌లోని పేశావర్, కరాచీ, లాహోర్‌లలోని సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలపై బాంబు దాడులు చేశాయి. కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసిన భారత సైన్యం, పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి నివాసానికి 20 మీటర్ల దూరంలో బాంబు పేలినట్లు తెలుస్తోంది, దీంతో ఆయన బంకర్‌లో తలదాచుకున్నారు.

దేశంలో భద్రతా చర్యలు

జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హరియాణాలలో హై అలెర్ట్ ప్రకటించారు. అధికారుల సెలవులు రద్దు చేసి, జిల్లా దాటి వెళ్లవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. 54 ఏళ్ల తర్వాత తొలిసారిగా దేశంలో బ్లాక్‌అవుట్ నిర్వహించారు, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

బలూచిస్థాన్ పోరాటం

ఈ ఉద్రిక్తతల నడుమ, బలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం పాకిస్థాన్‌పై పోరాటం కొనసాగిస్తోంది. భారత్-పాక్ యుద్ధం ఆగినా తమ పోరాటం ఆగదని బలూచిస్థాన్ ప్రతినిధి ప్రకటించారు. పాకిస్థాన్ ఆక్రమణ నుంచి తమ భూభాగాన్ని విడిపించేందుకు వారు కృషి చేస్తున్నారు.

ముగింపు

సింధూర్ 2.0గా పిలవబడే ఈ ఘర్షణలు సరిహద్దు రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. భారత సైన్యం దీటుగా స్పందిస్తూ దేశ భద్రతను కాపాడుతోంది. అయితే, పౌరుల భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం మరింత జాగ్రత్తలు అవసరం.

The post భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తత: సింధూర్ 2.0 appeared first on TelAndra.com.