heavy rains Archives - TelAndra.com

మొంతా తుఫాన్ ఏపీ తీరాన్ని ముంచెత్తింది
మొంతా తుఫాన్ తీవ్ర తుఫాన్ కోనసీమ బెల్ట్‌లో ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు 6-8 గంటలు పట్టవచ్చని వాతావరణ శాఖ అంచనా. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, ఉప్పాడ ప్రాంతాల్లో భీభత్స వర్షాలు, భారీ చెట్లు నేలకూలుతున్నాయి, విద్యుత్ స్తంభాలు తెగిపడుతున్నాయి. విశాఖ, అనకాపల్లి, అల్లూరి ఏజెన్సీల్లో అతిభారీ వర్షాలు, గంటకు 80 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరాన్ని తాకే సమయంలో 100-110 కిమీ వేగం ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు.

విశాఖలో హైవేలపై చెట్లు కుప్పకూలి ట్రాఫిక్ అంతరాయం. గాజువాక, మలకాపురం ప్రాంతాల్లో రోడ్లు జలమయం, పోలీస్ స్టేషన్‌లోనూ నీరు చేరింది. 15-20 సెం.మీ వర్షపాతం నమోదు. బీచ్ ప్రాంతాల్లో పోలీసుల బందోబస్త్, ఎవరినీ అనుమతించడం లేదు. మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయం భయం.

సీఎం చంద్రబాబు అమరావతి నుంచి, మంత్రులు జిల్లాల్లో పరిస్థితి పర్యవేక్షణ. అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సన్నద్ధం. చెట్లు, స్తంభాలు తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ టీమ్స్ సిద్ధం. టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో. ప్రజలు అత్యవసరం తప్ప బయటకు రావద్దని హెచ్చరిక. కేంద్రం రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతోంది. రాత్రి ప్రభావం మరింత తీవ్రమవుతుందని అంచనా. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.

The post మొంతా తుఫాన్ ఏపీ తీరాన్ని ముంచెత్తింది appeared first on TelAndra.com.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లో భారీ వర్షాల హెచ్చరిక, ప్రజలకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌ కు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఎల్లుండికి అల్పపీడనంగా మారే సూచనలున్నాయని తెలిపింది. దీంతో రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయని హెచ్చరికలు జారీ చేశారు.

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో పలు చోట్ల పంట పొలాలు మునిగిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో పుల్కల్‌లో 14.7 సెం.మీ., నల్లవల్లిలో 9.7, చౌట్కూర్‌లో 9, అమీన్‌పూర్‌లో 8.1, జరాసంగంలో 7.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో శివంపేటలో 12.8, నర్సాపూర్‌లో 10.8, కాగజ్‌నగర్‌లో 9.3, చిన్నశంకరంపేటలో 8.6, టేక్మల్‌లో 7.2 సెం.మీ. వర్షం కురిసింది.

వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సిర్గాపూర్ మండలం గైరాన్ తండాకు వెళ్లే మార్గంలో వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో స్థానికులు ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. కొన్నేళ్లుగా రోడ్డు నిర్మాణం కోరుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

The post ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లో భారీ వర్షాల హెచ్చరిక, ప్రజలకు అలర్ట్ appeared first on TelAndra.com.

ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు: వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. చుండూరులో 27.4 సెంటీమీటర్లు, చేబ్రోలులో 23.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుడమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో విజయవాడలో గుండదల మండలం, వన్‌టౌన్‌లో వరద నీరు చేరింది. డ్రైన్‌లో పడి ఇద్దరు మృతి చెందగా, లయోలా కాలేజీ సమీపంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గం అస్తవ్యస్తమైంది. అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదమద్దూరులో వాగు ఉద్ధృతంతో 1000 ఎకరాల పంటలు మునిగాయి. కొండవీటి వాగు ప్రవాహంతో నరుకులపాడు, ఉంగుటూరు, ఖమ్మంపాడు గ్రామాలు జలమయమయ్యాయి. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలతో కృష్ణానది దిగువ ప్రాంతాల్లో వరద పెరిగింది. బల్లకట్టు పడవల రాకపోకలు నిలిచిపోయాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో కొండవాగులు పొంగాయి. రాజవమంగి మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వట్టిగడ్డ వద్ద కొండవాగు ప్రవహంతో రాకపోకలు స్తంభించాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సూదికొండ వద్ద రహదారిపై వరద నీరు ప్రవహించి, గోకవరం-జగ్గంపేట మార్గంలో అంతరాయం ఏర్పడింది. వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.

గుంటూరు జిల్లా నంబూరు నుంచి దుగ్గిరాల మార్గంలో వరద నీరు పొంగి ప్రవహిస్తున్నది. మోకాల్లోతు నీరుతో ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “రెండు రోజులుగా ఇదే పరిస్థితి. పొలాలు మునిగాయి, డ్రైనేజీ వ్యవస్థ సరిలేదు” అని గ్రామస్థులు వాపోతున్నారు. కాల్వలు తెగడం, ఎగువ ప్రాంతాల నుంచి నీరు రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

The post ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు: వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలు appeared first on TelAndra.com.