HAREESH RAO Archives - TelAndra.com

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కమిషన్ నివేదికపై బిఆర్ఎస్ న్యాయ పోరాటం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన ఏకపక్ష నివేదికను రద్దు చేయాలంటూ బిఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లలో కమిషన్ ఏర్పాటు జీఓ, నివేదికను రద్దు చేయాలని కోరారు. రాజకీయ కుట్రతో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు జరిగిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఏకపక్ష విచారణ జరిగిందని ఆరోపించారు.

మేడిగడ్డ బ్యారేజ్‌లో ఒక పిల్లర్ కొంగిన సంఘటన ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 650 పేజీల నివేదికను గత నెల 31న ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్, విచారణలో సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. కమిషన్ చట్టం 1952లోని సెక్షన్ 8బి ప్రకారం పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం కల్పించలేదని ఆక్షేపించారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెంచ్ విచారణలో, నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా లేక చర్యల తర్వాత చర్చిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది సుదర్శన్ రెడ్డి రెండు రోజుల గడువు కోరగా, హైకోర్టు శుక్రవారమే సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక బహిర్గతం, అసెంబ్లీ చర్చలపై హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.

The post కాళేశ్వరం  ప్రాజెక్ట్‌ కమిషన్ నివేదికపై బిఆర్ఎస్ న్యాయ పోరాటం appeared first on TelAndra.com.

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఆశ్చర్యం.
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్

కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు జస్టిస్ ఘోష్ నివేదికపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నివేదికకు సంబంధించి వారిద్దరూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు కోసం ఈ నివేదికను ఉపయోగిస్తోందని కేసీఆర్, హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.

ప్రభుత్వ విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదిక ద్వారా బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని కేసీఆర్, హరీష్ రావు విమర్శించారు. కమిషన్ రిపోర్టు చట్టానికి అనుగుణంగా లేదని, దానిపై స్టే విధించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు తీవ్ర చర్చ జరిపింది.

హైకోర్టు వైఖరి

జస్టిస్ ఘోష్ నివేదికలోని అంశాలపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, దాని చట్టబద్ధతను ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. రేపటి విచారణలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

The post కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఆశ్చర్యం. appeared first on TelAndra.com.

మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు
మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీటి వనరుల వినియోగంపై నిర్లక్ష్యం చూపడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. యెల్లంపల్లిలో ఏడు మోటార్లు ఉండగా, మూడు మాత్రమే నడిపించడం వల్ల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు మోటార్లను నడిపితే రోజుకు రెండు టీఎంసీల నీటిని మిడ్‌మానేర్‌కు తేవచ్చని, అక్కడి నుంచి అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బసవాపూర్ రిజర్వాయర్లకు తరలించి యాసంగి పంటలకు నీరు అందించవచ్చని ఆయన సూచించారు.

అలాగే ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాలువ గేట్లు ఎత్తి మిడ్‌మానేర్ నింపాలని, అక్కడి నుంచి కాళేశ్వరం మోటార్ల ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌లు నింపాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వాయర్లు వర్షపు నీటితో నిండవని, కేవలం మోటార్ల ద్వారానే నింపగలమని హరీష్ రావు స్పష్టం చేశారు.

కృష్ణా నదిలో వరదల కారణంగా ఇప్పటికే ఉచితంగా భారీ స్థాయిలో హైడ్రో పవర్ ఉత్పత్తి అవుతుందని, అయినా ప్రభుత్వం కరెంట్ సరఫరా చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులకు ఎరువులు, పంటల బీమా, అవసరమైన సౌకర్యాలు ఇవ్వకపోవడమే కాకుండా, అందుబాటులో ఉన్న నీటిని సముద్రంలో వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే, వేలాది మంది రైతులను తీసుకుని ఆందోళనలు చేపట్టతామని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.

The post మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు appeared first on TelAndra.com.

కాళేశ్వరం రిపోర్ట్‌పై వివాదం.
కాళేశ్వరం రిపోర్ట్‌పై వివాదం: హరీష్ రావు, పొంగులేటి మధ్య మాటల యుద్ధం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన రిపోర్ట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు “ట్రాష్, బేస్‌లెస్” అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ రిపోర్ట్‌లో ఆధారాలు లేని ఆరోపణలు ఉన్నాయని, పూర్తిగా నిరాధారమైనవని ఆయన ఆరోపించారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, రిపోర్ట్ తమకు అనుకూలంగా లేనందునే హరీష్ రావు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్ట్‌ను సమీక్షించడం ముఖ్యమంత్రి, ప్రభుత్వ బాధ్యత అని, దీన్ని రాజకీయ జోక్యంగా చెప్పడం సరికాదని ఆయన అన్నారు.

పొంగులేటి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, దాని బాధ్యత మాజీ ముఖ్యమంత్రి తీసుకున్నారని హరీష్ రావే గతంలో చెప్పారని గుర్తు చేశారు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో నీతి, నిజాయితీతో సమర్పించిన రిపోర్ట్‌ను అనుకూలంగా లేనందున ప్రశ్నించడం హరీష్ రావు అవివేకాన్ని, మూర్ఖత్వాన్ని చాటుతుందని విమర్శించారు. ఈ రిపోర్ట్ నిజాలను స్పష్టంగా వెల్లడిస్తుందని, దాన్ని తప్పుబట్టడం సరికాదని ఆయన అన్నారు.

ఈ వివాదం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. రిపోర్ట్‌లోని వాస్తవాలు, ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఈ మాటల యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

The post కాళేశ్వరం రిపోర్ట్‌పై వివాదం. appeared first on TelAndra.com.

ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం.
ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. వచ్చే నెల కరీంనగర్‌లో నిర్వహించనున్న బీసీ గర్జన సభపై చర్చించారు. ఈ సభను విజయవంతం చేయడానికి జన సమీకరణ, ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఆగస్టులో బీసీ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అంశంపై కూడా చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బీసీ ఆర్డినెన్స్‌లో 42% రిజర్వేషన్ల అంశంపై కేసీఆర్ నేతలతో సమాలోచనలు జరిపారు. అలాగే, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయి ధర్మరత్నం, తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు మూడు నెలల్లో ఈ కేసుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. 400 పేజీల ఈ నివేదికను జస్టిస్ పీసీ కోచ్ సంతకం చేసి, ప్రభుత్వానికి సమర్పించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఎదుర్కొనే వ్యూహంపై కేసీఆర్ నేతలకు సూచనలు చేశారు. ప్రాజెక్ట్ వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.

The post ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం. appeared first on TelAndra.com.

కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హరీష్ రావు హాజరు
కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హరీష్ రావు హాజరు :

BRS నేత, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కోసం కమిషన్ ముందు హాజరయ్యారు. హరీష్ రావు తో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా PCB గోస్ ఆఫీస్‌కు చేరుకున్నారు.

హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు వివరంగా సమాధానాలు ఇస్తానని, తమ వద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని సమర్పిస్తామని, అంతేకాకుండా కొన్ని డాక్యుమెంట్లను కూడా అందజేస్తామని తెలిపారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం విద్వేషంతో కాకుండా వివేకంతో, విజ్ఞతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని, తమ పార్టీ దేవుడి మీద, రాజకీయ నీతిపై నమ్మకం ఉన్న పార్టీ అని, చివరికి న్యాయమే గెలుస్తుందని, ధర్మం నిలబడుతుందని హరీష్ రావు అన్నారు.

రెండు రోజుల క్రితం హరీష్ రావు ఏమన్నారు ?

రెండు రోజుల క్రితం కాళేశ్వరం గురించి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ 3 బ్యారేజ్‌లు, 15 రిజర్వాయర్‌లు, 19 సబ్-స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగంతో కూడినదని వివరించారు. ఈ మొత్తం నిర్మాణాల్లో మూడు బ్యారేజ్‌లలో ఒక బ్యారేజ్‌లో కేవలం రెండు స్తంభాలు మాత్రమే కుంగిపోయాయని, అయినప్పటికీ కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని, దీనికి పనికిరాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్ధమని హరీష్ రావు అన్నారు.

విచారణలో హరీష్ రావు ప్రెస్ మీట్ :

90 నిమిషాల విచారణ అనంతరం బయటకు వచ్చిన హరీష్ రావు, కమిషన్ ముందు రాజకీయంగా మాట్లాడలేదని, కమిషన్‌కు ఇచ్చిన సమాచారాన్ని మీడియాకు కూడా వెల్లడిస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ స్థానం ఎందుకు మార్చారనే అంశంపై ఎక్కువ సమయం చర్చ జరిగిందని, దానికి తాను పూర్తి వివరణ ఇచ్చానని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి నిర్ణయించిందని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా పనులు ప్రారంభించిందని ఆరోపించారు. తాను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను సమీక్షించి, దానికి గణనీయమైన ఖర్చు చేశామని, మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రితో కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, అప్పటి మహారాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి లేఖ రాశామని, ఆ లేఖలో నిర్ణయాలు తీసుకుని పనులు చేస్తే ఎలాంటి అడ్డంకులు ఉండవని పేర్కొన్నట్లు చెప్పారు. ఆ లేఖను కూడా కమిషన్‌కు అందజేశామని తెలిపారు.

సెంట్రల్ వాటర్ కమిషన్, మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్‌పై రెండు లేఖలు రాసిందని, రాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రాజెక్ట్ డిజైన్‌ను మార్చామని, ఆ వివరాలను కూడా కమిషన్‌కు సమర్పించామని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు కేబినెట్ అనుమతి ఉందా అని కమిషన్ అడిగిన ప్రశ్నకు, ఆ డాక్యుమెంట్‌ను కూడా అందజేశామని, బ్యారేజ్ స్థాన మార్పులు పూర్తిగా ఇంజనీర్ల సర్వే ఆధారంగా జరిగాయని వివరించారు.

కాళేశ్వరం పై ఆరోపణలపై హరీష్ రావు స్పందన :

కొందరు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను “కులేశ్వరం” అని పిలుస్తున్నారని, అయితే సీఎం రేవంత్ రెడ్డి గతంలో గంగమల్ల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారని, ఆ గంగమల్లకు నీరు మల్లన్నసాగర్ నుంచి వస్తుందని, అది కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమేనని హరీష్ రావు ప్రశ్నించారు. అలాగే, హైదరాబాద్‌కు మూసీ సుందరీకరణ కోసం 30 టీఎంసీల నీటిని తీసుకొస్తామని చెబుతున్నారని, ఆ నీరు కూడా మల్లన్నసాగర్ నుంచే వస్తుందని, అది కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమేనని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఇతర ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తూ, ఒకవైపు కాళేశ్వరం కూలిపోయిందని, కులేశ్వరం అని అనడం సమంజసం కాదని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం తెలంగాణకు జీవనది అని, కమిషన్ ముందు అన్ని ఆధారాలను సమర్పించామని హరీష్ రావు స్పష్టం చేశారు.

The post కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హరీష్ రావు హాజరు appeared first on TelAndra.com.