emmadi ravi Archives - TelAndra.com

ఐబొమ్మ ఎమ్మిడి రవి అరెస్ట్ – హైదరాబాద్ పోలీసుల ఘన విజయం
హైదరాబాద్ సిటీ పోలీసులు తెలుగు సినిమా పరిశ్రమకు శాపంగా మారిన పైరసీ రాకెట్‌ను ఛేదించారు. ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) మాస్టర్‌మైండ్ విశాఖపట్నం వాస్తవ్యుడు ఎమ్మిడి రవిను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై చిరంజీవి, నాగార్జున, రాజమౌలి, దిల్ రాజు, సురేష్ బాబు తదితర తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల సమక్షంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఎమ్మిడి రవి 2019 నుంచి 110కిపైగా డొమైన్లు, 65 మిర్రర్ సైట్లతో పైరసీ రాకెట్ నడిపాడు. 21 వేలకుపైగా సినిమాలు (1972 ‘గాడ్‌ఫాదర్’ నుంచి తాజా ‘OG’ వరకు) అక్రమంగా అప్‌లోడ్ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లలో సర్వర్లు పెట్టి, టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా కార్యకలాపాలు సాగించాడు. ఈ వెబ్‌సైట్ ద్వారా 50 లక్షల మంది సభ్యుల వ్యక్తిగత డేటాను సేకరించి, ఆన్‌లైన్ బెటింగ్ యాప్స్ కి రీడైరెక్ట్ చేసి వేల కోట్ల రూపాయల మోసాలకు కారకుడయ్యాడు. ఇప్పటివరకు సుమారు 20 కోట్లు సంపాదించినట్టు ఒప్పుకున్నాడు; దీనిలో రూ.3 కోట్ల నగదు, లాప్‌టాప్స్, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.

అడిషనల్ సీపీ శ్రీనివాస్, డీసీపీ కవిత, ఏసీపీ శివమూర్తి నేతృత్వంలోని బృందం నెలల తరబడి రహస్య గస్తీ చేసి ఈ అరెస్ట్ సాధ్యం చేసింది. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ లింకులు ఉన్న నేపథ్యంలో సీబీఐ, ఈడీకి సమాచారం అందించనున్నట్టు పోలీసులు తెలిపారు.

పైరసీ వల్ల కేవలం సినిమా పరిశ్రమకే కాదు, ప్రజల వ్యక్తిగత డేటా దుర్వినియోగం, సైబర్ మోసాలు, ఆన్‌లైన్ బెటింగ్ బారిన పడి అనేక కుటుంబాలు నాశనమైన విషయాన్ని పోలీసులు, సినీ పెద్దలు గుర్తుచేశారు. “పైరసీ చూడటం కూడా నేరం, మీ డేటా డార్క్ వెబ్‌లో చేరి మీకే ప్రమాదం” అని హెచ్చరించారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు: “పైరేటెడ్ సైట్లకు దూరంగా ఉండండి. ఒరిజినల్ కంటెంట్ మాత్రమే చూడండి. ఏదైనా సమాచారం ఉంటే 1930 లేదా cybercrime.gov.inకి తెలియజేయండి.”

తెలుగు సినిమా పరిశ్రమ, హైదరాబాద్ పోలీసులు కలిసి పైరసీకి వ్యతిరేకంగా ఉక్కుపాదంతో పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

The post ఐబొమ్మ ఎమ్మిడి రవి అరెస్ట్ – హైదరాబాద్ పోలీసుల ఘన విజయం appeared first on TelAndra.com.