ISPL LEAGUE 2025

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ : టీ10 క్రికెట్‌లో కొత్త ఊపు

భారతదేశంలో క్రికెట్‌కు అపారమైన ఆదరణ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2008లో ప్రారంభమైనప్పటి నుంచి, వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లు టీ20 ఫార్మాట్‌లో లీగ్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది టీ10 ఫార్మాట్‌లో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) పురుడు పోసుకుంది. టెన్నిస్ బంతితో జరిగే ఈ లీగ్ ద్వారా స్ట్రీట్ లెవెల్ ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది.

ISPL TEAM

ఈ ఏడాది ఐఎస్‌పీఎల్‌లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఎనిమిదో జట్టుగా చేరింది, దీనిని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సొంతం చేసుకున్నారు. ఈ లీగ్‌లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ (ముంబై), సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ (కోల్‌కతా టైగర్స్), అక్షయ్ కుమార్ (శ్రీనగర్ కేవీర్), సూర్య (చెన్నై సింగమ్స్), హృతిక్ రోషన్ (బెంగళూరు స్ట్రైకర్స్), రామ్‌చరణ్ (హైదరాబాద్ ఫాల్కన్ రైడర్స్), సల్మాన్ ఖాన్ (న్యూ ఢిల్లీ) యజమానులుగా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ ఈ లీగ్ కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

ISPL AJAY DEVGAN

మూడో సీజన్ కోసం 40 లక్షల మందికి పైగా ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు, దేశవ్యాప్తంగా 101 పట్టణాల నుంచి రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఈ లీగ్ ద్వారా స్థానిక ప్రతిభకు అవకాశాలు లభిస్తాయని, జట్ల సంఖ్య పెరగడం వల్ల మరిన్ని టాలెంట్‌లు వెలుగులోకి వస్తాయని సచిన్ సంతోషం వ్యక్తం చేశారు.