Headlines

రోహిత్ శర్మకి దక్కిన అరుదైన గౌరవం.

రోహిత్ శర్మ కి దక్కిన అరుదైన గౌరవం. మే 16 న ముంబై క్రికెట్ అసోసియేషన్ రోహిత్ శర్మ పేరుని ముంబై వాంఖేడ్ స్టేడియం లోని ఒక ప్రేక్షకుల గ్యాలెరీ కి ‘రోహిత్ శర్మ స్టాండ్’ అని పేరుని పెట్టినట్టు అధికారికంగా ప్రకటించారు.

ROHITH STAND

రోహిత్ శర్మ 2007లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 2010లో జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు టోర్నమెంట్‌లో ఆతిథ్య జట్టుపై 114 పరుగులు చేయడం ద్వారా అతని తొలి సెంచరీ వచ్చింది. రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 49 సెంచరీలు సాధించాడు. 2014 లో శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో 264 వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డు తో పటు ODI ఫార్మాట్ లో మూడు డబల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు గా నిలిచాడు.

ROHITH SHARMA

ఈ స్టాండ్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. రోహిత్ తల్లి తండ్రులు పూర్ణిమ, గురునాధ్ , భార్య రితిక, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్,ముంబై ఇండియన్స్ మొత్తం టీం ఈ కార్యక్రమానికి హాజరయ్యి “రోహిత్ శర్మ స్టాండ్” ను ప్రారంభించారు.