Headlines
RETIREMENT

టెస్ట్ మ్యాచ్ ల కు గుడ్ బై చెప్పిన టాప్ ప్లేయర్స్

వారం వ్యవధి లో నే టెస్ట్ మ్యాచ్ ల కు రిటైర్మెంట్ ప్రకటించిన టాప్ ప్లేయర్స్. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లు టెస్ట్ మ్యాచ్ ల కు రిటైర్మెంట్ ప్రకటించారు .

దీనితో ఇప్పుడున్న జట్టు లో సీనియర్స్ కు కొరత వచ్చింది. ఇప్పుడు ఉన్న వారిలో వీళ్ళ తరువాత టెస్టు మ్యాచ్ ల లో స్పెషలిస్ట్ గా రహానే మరియు పూజారా ను ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో ఎంపిక చేయాలనీ ప్రేక్షకులు అంటున్నారు. వీళ్లు వారి కెరీర్ లో టాప్ ప్లేయర్స్ గా గుర్తింపు ను తెచ్చుకున్నారు .

రోహిత్ శర్మ :

రోహిత్ శర్మ 2007 లో తన అరంగేట్రం చేసారు . అదే సంవత్సరం T20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ జట్టు లో ఆడారు. టెస్ట్ మ్యాచ్ లు ఇప్పటికి 67 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు సగటు 40 .57 లో 4301 పరుగులు చేసారు. టెస్ట్ మ్యాచ్ కు గాను 12 సెంచరీలు కొట్టారు. టెస్ట్ ఫార్మటు మ్యాచ్ లో 2022 సంవత్సరం లో కాప్టెన్ అయ్యారు. మే 7 2025 రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది ఇంకా కొన్ని సంవత్సరాలు ఆడి ఉంటె బాగుండేది అని సీనియర్ క్రికెటర్స్, ప్రేక్షకులు వారి మనసులో భావాలని వ్యక్తం చేసారు.

IPL :

రోహిత్ శర్మ 2011 లో ముంబై ఇండియన్స్ లో అరంగేట్రం చేసారు. 2013 లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ముంబై ఇండియన్స్ టీం కి కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఇప్పటివరకు 268 మ్యాచ్ లు ఆడారు 6,928 పరుగులు తీశారు 2 సెంచరీలు 46 అర్ధ సెంచరీ లు చేసారు . అతని కెప్టెన్సీ లో ముంబై ఇండియన్స్ ఇప్పటికి 5 సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది .

విరాట్ కోహ్లీ :

కోహ్లీ కెరీర్ మొదలు పెట్టి ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది, 2008 లో కోహ్లీ అరంగేట్రం చేసారు. కానీ 2011 లో వరల్డ్ కప్ గెలిచాక తనకి టెస్ట్ మ్యాచ్ లో ఆడే అవకాశం వచ్చింది. భారత్ తరపున టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ చేసిన అత్యధిక పరుగులు 9230, 46.85 సగటు లో౩౦ సెంచరీ లు పూర్తి చేసారు. విరాట్ కోహ్లీ ఆడిన టెస్ట్ ఫార్మటు మ్యాచ్ లో 68 మ్యాచ్ లో 40 మ్యాచ్ లు గెలిచింది. టెస్ట్ మ్యాచ్ లో 4 వ స్థానంలో ఉన్నారు కెప్టెన్ గా 5864 పరుగులు, 20 సెంచరీ లు, 7 డబల్ సెంచరీ లు చేసారు .

కోహ్లీ ఈ సమయం లో రిటైర్మెంట్ ప్రకటించడం చాల ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే తన టెస్ట్ ఫార్మటు లో 10,000 రన్స్ మార్కు కి 770 రన్స్ దూరం లో ఆగిపోయారు, 10,000 మార్కు ను పూర్తి చేసాక రిటైర్మెంట్ తీసుకుంటే బాగుండేది అని కోహ్లీ ఫాన్స్ అంటున్నారు.

మొదటి స్థానం లో సచిన్ 15,921 పరుగులు తో , రెండవ స్థానం లో ద్రావిడ్ 13 ,265 మూడవ స్థానం లో గవాస్కర్ 10,122 పరుగులు, నాల్గవ స్థానం లో విరాట్ కోహ్లీ 9230 పరుగులు చేసారు. టెస్ట్ క్రికెట్ లో రిటైర్మెంట్ ప్రకటించడం తో ఆ ఫార్మటు లో తను అందించిన విశేష సేవలను గుర్తు చేస్తూ తనకి సన్మానం చేయాలనీ నిర్ణయించారు .

IPL :

కోహ్లీ 2008 లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసారు ఇప్పటివరకు 263 మ్యాచ్ లు ఆడారు 39.58 సగటు లో 8,509 పరుగులు చేసారు, 8 సెంచరీ లు హాఫ్ సెంచరీ 50 చేసారు. 2011 లో RCB కి కెప్టెన్ గ ఎంపికయ్యారు.ఇప్పటికి 18 సీన్స్లోన్ల లో RCB కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగుళూరు లో చిన్నస్వామి స్టేడియం లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి ఈ నెల 17 న RCB మేనేజ్మెంట్ సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తుంది.

ఈ టాప్ ప్లేయర్స్ ఇద్దరికి ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు చెప్పాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అందుకు వీళ్లకు పూర్తి అర్హత ఉందని బీసీసీఐ తెలిపింది.