
ఐపిఎల్ చరిత్రలో నే ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ .
నిన్న జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో,
ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన భారత యువ ప్లేయర్.
ఇన్నింగ్స్ లో 11*6 లు , 7*4 లు , ఐపిఎల్ చరిత్రలో నే ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ .
బీహార్ కి చెందిన వైభవ్ 2024 రంజీ ట్రోఫీ లో తనదైన సత్తా చాటాడు . T20 క్రికెట్ చరిత్ర లోనే 14 ఏళ్ళు వయస్సు గల వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా ప్రపంచ రికార్డు పొందారు.
రాజస్థాన్ రాయల్స్ కోచ్ ద్రావిడ్ ఏకంగా వీల్ చెయిర్ లో నుంచి లేచి చప్పట్లు కొడుతూ సెలెబ్రేట్ చేసారు.కోచ్ ద్రావిడ్ 2025 ఐపీల్ ప్రారంభం నుంచి వీల్ చైర్ లో ఉన్న విషయం తెల్సిందే.
వైభవ్ సూర్యవంశీ పై ప్రశంశల వర్షం కురిసింది, అవుట్ అయ్యి వెళ్తున్న వైభవ్ కి ప్రేక్షకులతో పాటు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు, గుజరాత్ ఆటగాళ్లు అంత దగ్గరికి వచ్చి అభినందించారు.
సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ లో సూర్యవంశీ గెలుపు గాను నిర్భయం తో కూడిన బాటింగ్, బాల్ ని గట్టిగ కొట్టే విధానమే ఈ ఇన్నింగ్స్ కి కారణం అని ట్వీట్ చేసారు.
అలాగే పలువురు క్రికెటర్స్ యువ రాజ్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ తమ సోషల్ మీడియా లో వైభవ్ ను అభినందిస్తూ పోస్ట్ చేసారు.
2013 లో పూణే వారియర్స్ మరియు ఆర్ సి బి మధ్యలో జరిగిన మ్యాచ్ లో ఆర్ సి బి తరపున ఆడిన క్రిస్ గేల్ ఐపిఎల్ లో తన మొదటి ఫాస్టెస్ట్ సెంచరీ ని 30 బంతుల్లోనే పూర్తి చేసారు.
వైభవ్ సూర్యవంశీ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ కి గాను బీహార్ ప్రభుత్వం తనకి 10 లక్షల రివార్డ్ ను అందిస్తున్నట్టు సీఎం నితీష్ కుమార్ గారు ప్రకటించారు.