
బీజేపీ ఎంపీ కి నక్సలైట్ల బెదిరింపు.
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు ఫోన్ కాల్. ఈ రోజు రాత్రి లోపు చంపేస్తాం, దమ్ముంటే కాపాడుకోండి అంటూ ఫోన్‌లో బెదిరించిన వ్యక్తి. ఈ రోజు మధ్యాహ్నం 2:43 – 3:29 గంటల మధ్య 352938 నంబర్ నుండి ఫోన్ కాల్. మధ్యప్రదేశ్ నుండి ఫోన్ చేస్తున్నట్లు, మావోయిస్టుగా పరిచయం చేసుకున్న వ్యక్తి. మధ్యప్రదేశ్ నుండి బయల్దేరాం, రాత్రి 10 గంటలలోపు చేరుకుంటాం అంటూ ఫోన్ కాల్.
అయితే ఆ సమయం ఎంపీ రఘునందన్ దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో రఘునందన్ రావు PA కాల్ అటెండ్ చేశారు. మళ్ళీ కాసేపటి తర్వాత అదే నంబర్ నుండి మళ్ళీ ఫోన్ రావడంతో డీజీపీ గారికి, సంగారెడ్డి SP కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన ఎంపీ రఘునందన్ రావు. ఆ నంబర్ ఎవరిది, ఎక్కడి నుండి ఫోన్ చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఆ నంబర్ ఇంటర్నెట్ ద్వారా వచ్చిన ఫోన్ కాల్‌గా చెప్పారు.
ఈ పాటికే మావోయిస్టులపై కేంద్రం ఆపరేషన్ కాగర్ నిర్వహిస్తోంది. తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని నక్సలైట్లను అంతం చేసేందుకు తరచు కూంబింగ్‌లు, ఎన్‌కౌంటర్లు నిర్వహిస్తున్నారు. నిన్న ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ నక్సలైట్లు అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి అన్నారు, లేని పక్షంలో 2026 మార్చి 31 లోపు నక్సలైట్లు అందరినీ అంతం చేస్తాం అన్నారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మావోయిస్టులు ఎంపీ రఘునందన్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారా? ఇంకా వేరే బీజేపీ నేతలకు కూడా ఇలాంటి ఫోన్లు చేస్తారా? ఇది కేవలం బెదిరింపు ఫోన్‌లు మాత్రమేనా లేక వాళ్ళు కూడా ఏమైనా యాక్షన్ లోకి దిగారా అన్నది చూడాల్సి ఉంది.