
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏప్రిల్ 27 న వరంగల్ లో జరగనుంది పార్టీ ఆవిర్భావం అయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. అందుకు గాను 25వ వార్షికోత్సవం సందర్భముగా భారీ రజతోత్సవ సభను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏప్రిల్ 27 2001 న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన ఎన్నో పోరాటాల్లో తాను సైతం అని కేసీఆర్ గారు ముందు ఉండి తెలంగాణ సాధన లో తనదైన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధ్యం అయింది అంటే అది కేసీఆర్ అని చెప్పడంలో సందేహం లేదు. 29 నవంబర్ 2009 న కాంగ్రెస్ పార్టీ ని ప్రత్యేక తెలంగాణ బిల్ ని పార్లమెంట్ లో ప్రెవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు వివిధ సంస్థలు ఉద్యమం లో పాల్గున్నాయి. ఆ దీక్షతో తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసుకుని ఎన్నో అవాంతరీయా పరిస్థుతుల తర్వాత 2014 లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
తెరాస పార్టీ ని ఏర్పాటు చేసి ఈ ఏడాది ఏప్రిల్ 27 కి సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది.అందుకు గాను ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లా లోని ఎలకకుర్తి లో భారీ సభ ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త తరలిరావాలని పిలుపునిచ్చారు.
పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వచ్చేలా బీఆర్‌ఎస్ నేతలు ఎవరి శైలి లో వారు కృషి చేస్తున్నారు. ఈ నెల 27 న వారు నిర్వహించనున్న సభకు గాను 1250 ఎకరాల భూమిని సిద్ధం చేశారు. అందులో 250 ఎకరాల భూమిని సభకి గాను మిగితా 1000 ఎకరాల భూమిని పార్కింగ్ మరియు భోజన వసతులకు ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది.