Headlines
amaravathi

పునః ప్రారంభమవుతున్న అమరావతి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పునః ప్రారంభించడానికి మే 2 న ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు  ప్రధాని నరేంద్ర మోదీ గారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చంద్రబాబు నాయుడు గారు స్థాపించి, దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నగరంగా ప్రకటించారు. అయితే ఇలా ప్రకటించడం ఇది రెండోసారి.

మొదటిసారి 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి  ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు – విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికై ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని దీనికి అమరావతి అని పేరు పెట్టడానికి నిర్ణయించారు.

అక్టోబర్ 22 2014 న విజయ దశమి పర్వదినం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిచే ఆంధ్రప్రదేశ్ రాజధాని గా అమరావతికి శంకుస్థాపన కూడా చేసారు.

అమరావతి రాజధాని అభివృద్ధి జరగాలి అని కోరుకుంటు, భారత్ పార్లమెంట్ ప్రాంగణం నుంచి మట్టి మరియు ఎంతో పవిత్రమైన యమునా నది నుంచి జలంని తీసుకొచ్చాను అని చెప్పారు మోదీ గారు .

ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకి కేంద్రం నుంచి మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇతర రాష్ట్ర గవర్నర్ లు, జపాన్ దేశ మంత్రులు అతిధులుగా వచ్చారు.

ఆ తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఓటమి పాలు అయ్యి జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతి అంటే తనకి ఏమి కోపం లేదు అని. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని చెప్పుతూ మూడు రాజధానులను ప్రతిపాదించింది.

అవి విశాఖపట్నంని కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా మరియు కర్నూలును న్యాయవ్యవస్థ రాజధాని గా ఏర్పాటు చేస్తానన్నారు అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారు . కాగా 2025 ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాజధాని అంశం తేర పైకి వచ్చింది.

మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధాని గా నిర్ణయించారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవ సభను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సభ కు 5 లక్షల జనాభా రానున్నారు అని అంచనా.

సీఎం చంద్రబాబు గారు ఎప్పటికప్పుడు రాజధాని పనుల గురించి అధికారులతో, మంత్రులతో మాట్లాడుతూ ఏర్పాటులకు ఏ లోటు లేకుండా చూసుకోవాల్సింది గా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.